ఒక సినిమాను పూర్తి చేయాలంటే దానికోసం ఎన్నో వందల మంది కష్టపడతారని మనకు తెలుసు. మరి అంత కష్టపడి తీసిన సినిమాకు ప్రచార కార్యక్రమాలు కూడా అంతే ముఖ్యం. సినిమా తీసేశాం కదా రిలీజ్ చేసేస్తే సరిపోతుంది అని అనుకుంటే తప్పే. దానికి తగినట్టే ప్రమోషన్స్ చేయాలి. జనాల్లో సినిమా గురించి మంచి బజ్ క్రియేట్ చేయాలి. అప్పుడే చూసే ఆడియన్స్ కు కూడా సినిమా చూడాలన్న ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఇక ఆ విషయంలో రాజమౌళికి మాత్రం 100 మార్కులు వేయోచ్చు.
సినిమాను ఎలా అయితే ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తీస్తాడో ప్రమోషన్స్ ను కూడా అలానే చేస్తాడు రాజమౌళి. అందుకే తన సినిమా పట్ల అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తన సినిమా అంటే ప్రమోషన్స్ ఏరేంజ్ లో ఉంటాయో మరోసారి చూపిస్తున్నాడు జక్కన్న. ఎన్టీఆర్-రామ్ చరణ్ లు ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఇక ఈసినిమా
ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు చిత్రయూనిట్. ఇప్పటికే తెలుగు తో పాటు హిందీ, తమిళ్, కన్నడ ఇలా పలు ప్రెస్ మీట్ లలో పాల్గొన్నారు. ఇంకా పలు ఇంటర్వ్యూలల్లో పాల్గొంటున్నారు. ఏ అవకాశాన్ని రాజమౌళి వదులుకోవడం లేదు. దీనిలో భాగంగా నేడు ఆర్ఆర్ఆర్ తో రానా ముచ్చటించారు. ఇక ఈ విషయాన్ని రానా తన ట్విట్టర్ ద్వారా తెలియచేశారు.
A Mumbai morning with the
MIGHTY R’s #RRR with #R 😉 @ssrajamouli @tarak9999 @AlwaysRamCharan pic.twitter.com/TWsAoW7b2M— Rana Daggubati (@RanaDaggubati) December 22, 2021
కాగా భారీ బడ్జెట్ తో డీవీవీ దానయ్య ఈసినిమాను నిర్మించారు. ఇంకా ఆర్ఆర్ఆర్ లో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా… అజయ్ దేవగణ్, శ్రియా శరణ్, సముద్రఖని పలు కీలక పాత్రల్లో నటించారు. భారీ అంచనాల మధ్య జనవరి 7న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. దీనికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు.



[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.