మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలోని యాక్షన్ థ్రిల్లర్ గా 2 భాగాలుగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ”పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న రిలీజ్ అయ్యి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ కు ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. స్టార్ హీరోయిన్ సమంత ఒక స్పెషల్ సాంగ్ లో నటించి ప్రేక్షకులను అలరించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“పుష్ప: ది రైజ్” మూవీ కి తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషలలో అనూహ్య స్పందన లభిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ స్వరకల్పనలో చంద్ర బోస్ రచన ఇంద్రావతి చౌహాన్ హస్కీ వాయిస్‌తో గానం చేసిన, బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ లో సమంత అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన ఊ అంటావా.. ఊఊ అంటావా సాంగ్ విమర్శలు ఎదుర్కొన్నా యూట్యూబ్ లో దూసుకుపోతోంది. అయితే తాజాగా ఈ పాట అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఈ ఏడాది చివరలో వచ్చిన ఈ పాట సిజ్లింగ్ సాంగ్ ఆఫ్ ది ఇయర్‌గా మారిపోయింది. విడుదలైన 20 రోజుల్లోనే అన్ని భాషలలో 100ప్లస్ మిలియన్ వ్యూస్‌ని సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
































