డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసి ఆ తర్వాత నిర్మాతగా మారి ఇప్పుడు టాలీవుడ్ లోనే పెద్ద ప్రొడ్యూసర్ గా ఎన్నో హిట్ సినిమాలు అందిస్తున్నాడు దిల్ రాజు. దిల్ రాజు సినిమా అంటే మినిమం గ్యారెంటీ అన్న నమ్మకం అందరిలో ఉంటుంది. సక్సెస్ ను ఎప్పుడూ జేబులో పెట్టుకొని ఉంటారా అన్నట్టు తను నిర్మించే సినిమాల్లో చాలా వరకూ అన్నీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్నే దక్కించుకుంటాయి. ఇక ఈ ఏడాది వకీల్ సాబ్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మరోవైపు తెలుగులో సక్సెస్ బాటలో నడుస్తున్న దిల్ రాజు ఇప్పుడు పక్క ఇండస్ట్రీలపై కూడా ఫోకస్ పెడుతున్నాడు. బాలీవుడ్ లో ఇప్పటికే పలు సినిమాలను లైన్ లో పెట్టిన దిల్ రాజు తమిళ్ లో కూడా సినిమాలను చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే తన కెరీర్ లోనే మైలు రాయిగా వస్తున్న 50వ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో శంకర్ లాంటి డైరెక్టర్ తో ప్లాన్ చేశాడు. మరోవైపు స్టార్ హీరో విజయ్ తో కూడా మరో సినిమా చేయనున్నాడు. ఇంకా వీటితోపాటు కేవలం పెద్ద సినిమాలే అని కాకుండా చిన్న సినిమాలను సైతం నిర్మిస్తూ కొత్త టాలెంట్ ను ఎంకరేంజ్ చేస్తున్నారు.
ఇక నేడు దిల్ రాజు తన పుట్టినరోజును జరుపుకుంటుండగా ముందు ముందు కూడా ఎన్నో సినిమాలు నిర్మించాలని.. మంచి మంచి విజయాలను దక్కించుకోవాలని కోరుకుందాం. మరి మీకు నచ్చిన దిల్ రాజు సినిమా ఏంటో మీ ఓటు ద్వారా తెలియచేయండి.
[totalpoll id=”71760″]
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: