రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వస్తున్న పాన్ ఇండియా సినిమా రాధేశ్యామ్. ఇక ఈ సినిమా అప్‌డేట్ గురించి ప్రభాస్ అభిమానులు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న సంగతి కూడా తెలిసిందే. ఈనేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా అభిమానులు అప్ డేట్ ఇవ్వమని అడిగినా మేకర్స్ మాత్రం ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. అయితే ఈసినిమా సంక్రాంతికి బరిలో దిగుతున్న నేపథ్యంలో.. ఇక ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న చిత్రయూనిట్ ఇప్పుడు ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి తాజాగా ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ‘ఈ రాతలే’ అంటూ రిలీజ్ అయిన తొలి సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ పాటను తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా విడుదల చేయగా.. ఇప్పటికే ఈసాంగ్ 10 మిలియన్లకు పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. మరి ఒక్క పాటకే ఈ రేంజ్ లో ఉంటే ముందు ముందు ఈ సినిమా నుండి వచ్చే అప్ డేట్లు ఇంకా ఏ రేంజ్ లో ఉంటాయో చూడాలి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా యూరప్ నేపథ్యంలో పీరియాడిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్నఈసినిమాలో విక్రమాదిత్య పాత్రలో ప్రభాస్ నటిస్తుండగా.. ప్రేరణ పాత్రలో పూజా నటిస్తుంది. ఇంకా ఈ సినిమాలో భాగ్య శ్రీ, మురళీ శర్మ, ప్రియదర్శి, కునాల్ రాయ్ కపూర్, కృష్ణంరాజు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగు, మలయాళం, హిందీ, తమిళ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సౌత్ లాంగ్వేజస్ కు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తుండగా.. హిందీలో మిథున్, మనన్ భరద్వాజ్ ద్వయం సంగీత దర్శకులుగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమా సంక్రాంతి కానుకగా 2022, జనవరి 14న రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: