టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏమాయ చేశావే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సమంత మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇక అప్పటి నుండి ఇప్పటివరకూ సమంత కెరీర్ లో వెనుతిరిగి చూసుకోలేదు. మధ్యలో కొన్ని ఫ్లాప్స్ వచ్చినా కూడా సమంతకు కెరీర్ పరంగా మాత్రం ఏలాంటి ఇబ్బందులు కలగలేదు. ప్రస్తుతం అయితే స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ పాత్ర ప్రధానమైన సినిమాలు చేసుకుంటూ వెళుతుంది. కేవలం సినిమాలే కాకుండా డిజిటల్ మీడియాలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం సమంత విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో నయనతార తో కలిసి కాతు వాకుల రెండు కాదల్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్నాడు. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టిన చిత్రయూనిట్ దీనిలో భాగంగానే సమంత ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈసినిమాలో సమంత కతిజ అనే పాత్రలో నటిస్తుంది. ఈసినిమాను కూడా త్వరలో రిలీజ్ చేయనున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: