వంశీకృష్ణ ఆకెళ్ళ దర్శకత్వంలో ఆమని, గౌతమ్ రాజు, సౌమ్య శెట్టి ప్రధాన పాత్రలలో తెరకెక్కిన సినిమా ది ట్రిప్. వీడీఆర్ ఫిల్మ్స్ బ్యానర్‌పై దుర్గం రాజమౌళి ఈసినిమాను నిర్మిస్తున్నారు. కార్తీక్ కొడకండ్ల ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నారు. ఇక ఈసినిమా నేడు రిలీజ్ అయింది. మరి ఈసినిమా ఎలా ఉందో తెలియాలంటే రివ్యూ లోకి వెళ్లాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నటీనటులు.. ఆమని, గౌతమ్ రాజు, సౌమ్య శెట్టి తదితరులు
దర్శకత్వం.. వంశీకృష్ణ ఆకెళ్ళ
బ్యానర్స్.. వీడీఆర్ ఫిల్మ్స్ బ్యానర్
నిర్మాత.. రాజమౌళి
సంగీతం..కార్తిక్ కొడకండ్ల
సినిమాటోగ్రఫి.. విశ్వ దేవబత్తుల
కథ..
ది ట్రిప్ కథ డ్రగ్స్ కు బానిస అయిన గౌతమ్ అనే ఓ యువకుడి చుట్టూ తిరిగే కథ. డ్రగ్స్ కు బానిస అయిన గౌతమ్ ఆ మత్తులో తనకు తెలియకుండానే తను తీసుకునే నిర్ణయాల వల్ల ఇబ్బందులు ఎదుర్కుంటూ ఉంటాడు. ఈనేపథ్యంలోనే గౌతమ్ ఒకరోజు స్ప్రుహలోకి రాగానే అనుకోకుండా ఒక అడవిలో ఉంటాడు. ఇక అక్కడి నుండి గౌతమ్ ఎలా బయటపడ్డాడు.. ఫైనల్ గా ఒక మంచి మనిషిగా ఎలా మారాడు అన్నదే ఈ సినిమా కథ.
విశ్లేషణ
గౌతమ్ ఈసినిమాకు ప్రధాన బలం. డ్రగ్స్ కు బానిసైన పాత్రలో గౌతమ్ తన నటనతో పూర్తి న్యాయం చేశాడు. సినిమా మైదలైన దగ్గర నుండి చివరి వరకూ గౌతమ్ పెర్ఫామెన్స్ సినిమాకు హైలెట్ గా నిలుస్తుంది. ఇక ఈసినిమాలో గౌతమ్ కు తల్లిగా నటించిన ఆమనికి మరో మంచి పాత్ర దక్కిందని చెప్పొచ్చు. కొడుకును చూసి మదనపడే తల్లి పాత్రలో ఆమని జీవించేసింది. షఫీ కూడా ఈసినిమాకు మరో హైలెట్. తన పాత్రలో బాగా నటించాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రల మేర నటించారు.
ఇక డైరక్టర్ వంశీ కృష్ణా కూడా కథను ఎగ్జిక్యూట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. దానికి తోడు స్క్రీన్ ప్లే ను కూడా చాలా ఎంగేజింగ్ గా రాసుకోవడంతో ఆడియన్స్ ను చివరి వరకూ కూర్చోబెట్టగలిగాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం గౌతమ్ డ్రగ్స్ అడిక్ట్ అయ్యే విధానాన్ని.. దాని వల్ల తనకు కలిగే ఇబ్బందులను చూపించాడు డైరెక్టర్. ఇక సెకండ్ హాఫ్ లో గౌతమ్ లో మార్పు లాంటి విషయాలు చూపించారు. మరోవైపు ఇలాంటి సినిమాలకు సినిమాటోగ్రఫి చాలా ఇంపార్టెంట్. ఆవిషయంలో విశ్వ దేవబత్తుల తన కెమెరా పనితనాన్ని చూపించాడు. కార్తిక్ కొడకండ్ల నేపథ్య సంగీతం వల్ల కొన్ని సన్నివేశాలు మరింత హైలెట్ గా నిలిచాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.
అయితే మిగిలిన నటీనటులకు రోల్స్ అయితే ఇచ్చారు కానీ.. వారిని ఇంకాస్త ఎక్కువగా వాడుకొని ఉంటే బావుండేది. దానితో పాటు ఇలాంటి సినిమాలకు ట్విస్ట్ లే ఇంపార్టెంట్.. కానీ ప్రతి చిన్న దానికి ట్విస్ట్ లు ఉంటే కొంచం కష్టమే.. అలానే ఈసినిమాలో కూడా చిన్న చిన్న ట్విస్ట్ లు కాస్త ఇబ్బందికరంగా ఉంటాయి.. అలాంటివి తీసేసి ఉంటే బావుండేది.
ఫైనల్ గా చెప్పాలంటే ఈసినిమా యూత్ ను బాగానే ఆకట్టుకుంటుంది అని చెప్పొచ్చు. మధర్ సెంటిమెంట్ కూడా ఉంటుంది కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా బాగానే కనెక్ట్ అవుతారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: