కరోనా ఫస్ట్ అండ్ సెకండ్ వేవ్ కారణంగా రిలీజ్ కు నోచుకోని సినిమాలు ఇంకా ఎన్నో ఉన్న సంగతి తెలిసిందే కదా. ఫస్ట్ వేవ్ అయిపోయింది కదా సినిమాలు రిలీజ్ చేసుకోవచ్చు అనుకునే లోపే సెకండ్ వేవ్ వచ్చింది. దాంతో ఈరెండేళ్లలో ఎన్నో సినిమాలు పెండింగ్ లో పడిపోయాయి.. అందులో ఇప్పటికే చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి.. కొన్ని రిలీజ్ అవుతున్నాయి.. ఇక ఫైనల్ గా అడివి శేష్ ‘మేజర్’ సినిమా కూడా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. ఈసినిమా కూడా ఎప్పుడో మొదలైంది. ఈసినిమా కంటే వెనుక మొదలైన సినిమాలు రిలీజ్ అయినా కూడా ఈసినిమా ఇంకా షూటింగ్ ముగించుకునే పనిలోనే ఉంది. కరోనా వల్ల, ఇతర కారణాల వల్ల ఎన్నో సార్లు బ్రేక్ పడినా రీసెంట్ గానే ఫైనల్ షెడ్యూల్ ను స్టార్ట్ చేశారు. అది కూడా పూర్తి కావస్తుంది. ఈనేపథ్యంలో తాాజాగా ఈసినిమా నుండి బిగ్ అప్ డేట్ ఒకటి ఇచ్చారు. ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
#MajorTheFilm releases on
FEBRUARY 11th 2022 !
WORLDWIDE in THEATRES only#MajorOnFeb11https://t.co/y4KYVflr3B
This Video shows you a glimpse❤️
A Massive film inspired by the life, love and LEGACY of #MajorSandeepUnnikrishnan@urstrulyMahesh
Hindi : Telugu : Malayalam pic.twitter.com/tIpSvxRs7x
— Adivi Sesh (@AdiviSesh) November 3, 2021
కాగా శశికిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్ ప్రధాన పాత్రలో ఈసినిమా తెరకెక్కుతుంది. 26/11 ముంబై టెర్రర్ అటాక్‌లో అమరివీరుడైన ఆర్మీ ఆఫీసర్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. అడివి శేష్ సినిమా కాబట్టి ఈసినిమాపై మొదటి నుండి మంచి అంచనాలే ఉన్నాయి. ఈనేపథ్యంలోనే ఇప్పటివరకూ రిలీజ్ చేసిన పోస్టర్లకు టీజర్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ సినిమాలో శోభితా ధూళిపాళ్లతో పాటు సయీ మంజ్రేకర్ కూడా మరో కథానాయికగా నటిస్తుంది. ప్రకాష్ రాజ్, రేవతి, మురళి శర్మ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మహేష్ హోమ్ బేనర్ జీఎంబీ ప్రొడక్షన్స్ సోనీ పిక్చర్స్‌తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, మలయాళంలో కూడా రిలీజ్ చేయనున్నారు.
[subscribe]



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























