సురేష్ ప్రొడక్షన్స్ , గురు ఫిల్మ్స్ , క్రాస్ పిక్చర్స్ బ్యానర్స్ పై సుధీర్ వర్మ దర్శకత్వంలో రెజీనా, నివేద థామస్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. బ్లాక్ బస్టర్ కొరియన్ మూవీ “మిడ్ నైట్ రన్నర్స్ “కు తెలుగు రీమేక్ మూవీ గా రూపొందుతున్న ఈ మూవీ లోని తమ పాత్రలకై రెజీనా , నివేద కొరియన్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ వద్ద ట్రైనింగ్ తీసుకున్నారు. రెజీనా, నివేదా థామస్ మధ్య ఫైట్ ఈ సినిమా మొత్తానికే హైలైట్ గా నిలవనుందని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
యంగ్ హీరోయిన్స్ నివేదా థామస్, రెజీనా నటిస్తున్న మూవీకి మేకర్స్ టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ రీమేక్ చిత్రానికి “శాకిని డాకిని”టైటిల్‌ను ఖరారు చేసినట్టు సోషల్ మీడియా ద్వారా మేకర్స్ ప్రకటిస్తూ టైటిల్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. “శాకిని డాకిని” మూవీ రిలీజ్ డేట్ ను మేకర్స్ త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: