అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియా సినిమా పుష్ప. ఇక ఈసినిమా రెండు పార్ట్ లుగా వస్తున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఫస్ట్ పార్ట్ ను క్రిస్మస్ బరిలో దించనున్నారు. ఇదిలా ఉండగా ఈసినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదన్న సంగతి కూడా విదితమే. నిజానికి ఈసినిమా షూటింగ్ ను వచ్చే నెల ఫస్ట్ వీక్ లోపు కంప్లీట్ చేయాలని అనుకున్నారు చిత్రయూనిట్. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేశారు కాబట్టి మిగిలిన పోర్షన్స్ ను త్వరగా పూర్తి చేసి ప్రమోషన్ కార్యక్రమాలు ఫుల్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ ఈ సినిమా షూటింగే ఇంకా పూర్తి కాలేదు.. ఇంకా మూడు పాటలు పెండింగ్ లో ఉన్నాయని.. అంతేకాదు ఈ మూడు పాటలలో ఒక పాటను విదేశాల్లో చిత్రీకరించడానికి మేకర్స్ ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. దీంతో అనుకున్న టైమ్ కు షూటింగ్ పూర్తి కాదన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఫిక్స్ చేసిన డేట్ కు పుష్ప రిలీజ్ ఉంటుందో? లేదో? అన్న అనుమానాలు కూడా మొదలయ్యాయి. మరి చూద్దాం సుకుమార్ ఎలాంటి ప్లాన్ వేశాడో..
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా నుండి ఎప్పుడో విడుదలైన పుష్ప టీజర్ సినిమాపై భారీ అంచనాలు పెంచగా.. ఇటీవల విడుదలైన ఫస్ట్ సింగిల్, సెకండ్ సింగిల్ విడుదలై సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. దీంతో ఆ అంచనాలు మరింత పెరిగాయి.
కాగా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా…అల్లు అర్జున్ సరనస రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుంది. ఫహాద్ ఫాజిల్ విలన్ పాత్రలో నటిస్తుండగా యాంకర్ అనసూయ, సునీల్ తదితరలు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























