బ్లాక్ బస్టర్ “శివ” మూవీ తో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయిన రామ్ గోపాల్ వర్మ “శివ “మూవీ హిందీ రీమేక్ “శివ “తో బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. తెలుగు , హిందీ భాషలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన ఆర్ జి వి పలు వివాదాస్పద చిత్రాలను తెరకెక్కిస్తూ ప్రేక్షకులు ఆశ్చర్య పోయేలా చేస్తున్నారు. నిజ జీవిత కథలతో “రక్త చరిత్ర “, “వీరప్పన్ “, “వంగవీటి “, లక్ష్మీస్ ఎన్టీఆర్” వంటి మూవీస్ తెరకెక్కించిన ఆర్ జి వి ఇప్పుడు రాజకీయ నాయకుడు కొండా మురళి జీవిత చరిత్ర ఆధారంగా “కొండా”మూవీని తెరకెక్కిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘కొండా’ సినిమా షూటింగ్ నిన్న వరంగల్ జిల్లాలోని గీసుకొండ మండలం వంచనగిరిలో ప్రారంభమైంది.ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ.. కొండా బయోపిక్ తీయడానికి తాను ఆయన వెంట తిరగాల్సి వచ్చిందనీ , సురేఖ వెంట మురళి తిరిగినట్టుగా తాను తిరిగాననీ , తాను నిజాన్ని మాత్రమే ప్రేక్షకుల ముందు ఉంచుతాననీ , అది నెగెటివా? పాజిటివా? అనే విషయాన్ని వారే చెప్పాలనీ , “శివ” సినిమాను “కొండా”మూవీ దాటిపోయి చరిత్ర సృష్టిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.కొండా సురేఖ మాట్లాడుతూ.. తమ జీవిత కథ ఎంతో భిన్నమైనది కాబట్టే సినిమా తీసేందుకు ఆర్జీవీ ముందుకొచ్చారని చెప్పారు. “కొండా”మూవీలో ఎలా చూపించినా మీ ఇష్టం అంటూ మురళి చేతిని ఆర్జీవీ చేతిలో వేశారు. షూటింగ్ ప్రారంభానికి ముందు ర్యాలీ నిర్వహించారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: