స్పోర్ట్స్ డ్రామా మూవీస్ కి రెడీ – అఖిల్ అక్కినేని

Akhil Akkineni Says Yes To Sports Drama Movies

యంగ్ హీరో అఖిల్ అక్కినేని , సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ పూజాహెగ్డే జంటగా మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో GA 2 పిక్చర్స్ బ్యానర్ పై బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్” మూవీ దసరా కానుకగా అక్టోబర్ 15వ తేదీ రిలీజ్ కానుంది. “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్” మూవీ ప్రమోషన్స్ లో అఖిల్ అక్కినేని బిజీగా ఉన్నారు. హీరో అఖిల్ అక్కినేని ప్రస్తుతం స్పై థ్రిల్లర్ “ఏజెంట్ “మూవీ లో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్” మూవీ ప్రమోషన్స్ లోభాగంగా ఒక ఇంటర్వ్యూ లో అఖిల్ మాట్లాడుతూ .. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో రూపొందే మూవీస్ లో నటించాలని ఉందనీ , స్పోర్ట్స్ బ్యాక్ గ్రౌండ్ లో రూపొందే బయోపిక్ చిత్రాల్లో నటించేందుకు తాను సిద్ధంగా ఉన్నాననీ , క్రీడాకారుల కథలకు తాను బాగా సెట్ అవుతాననీ , ఎంతో మంది జీవితాలను క్రికెటర్ విరాట్ కోహ్లీ ప్రభావితం చేశారనీ , అతడి బయోపిక్ తీస్తే బాగుంటుందనీ , ఆ బయోపిక్ లో నటించేందుకు తాను సిద్ధం అనీ , క్రికెటర్ కపిల్ దేవ్ బయోపిక్ “83” హిందీ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాననీ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 2 =