ఎ కె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూపర్ హిట్ “RX 100 ” మూవీ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ అక్టోబర్ 14 వ తేదీ రిలీజ్ కానుంది. హీరో సిద్ధార్ధ్ ఒక కీలక పాత్రలో నటించారు. అదితి రావు హైదరి , అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలు కాగా జగపతి బాబు , రావు రమేష్ ముఖ్య పాత్రలలో నటించారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“మహాసముద్రం” చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ , సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచాయి. మూవీ రిలీజ్ సందర్భంగా “మహాసముద్రం”మూవీ ప్రీ రిలీజ్ఈవెంట్ ను గ్రాండ్ గా జరపడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. అక్టోబర్ 9 తేదీన “మహా సముద్రం” మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జెఆర్‌సి కన్వెన్షన్‌లో సాయంత్రం 6 గంటలకు జరగనుంది. హీరో శర్వానంద్ “ఆడవాళ్ళు మీకు జోహార్లు “, తెలుగు ,తమిళ భాషలలో తెరకెక్కుతున్న “ఒకే ఒక జీవితం ” మూవీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: