సాయి కుమార్ వారసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆది సాయికుమార్ మొదటి సినిమా ప్రేమ కావాలి తోనే హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన లవ్లీ సినిమాకూడా మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఆ తరువాత వచ్చిన సినిమాల్లో ఆ స్థాయిలో విజయం సాధించలేదు. అయినా కూడా హిట్స్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలను చేసుకుంటూ వెళుతున్నాడు. ఇక ఇప్పటికే ఆది లిస్ట్ లో చాలా సినిమాలు ఉన్నాయి. అతిథి దేవోభవ, బ్లాక్, అమరన్, కిరాతక అనే సినిమాలు చేస్తున్నాడు. వీటిలో కొన్ని సినిమాలు షూటింగ్ దశలో ఉండగా.. కొన్ని సినిమాలు దాదాపు చివరి దశలో ఉన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
#ASK20 📢
Announcement poster is here, Muhurtham on Dussehra [15-10-2021 ] in Ramanaidu Studios at 9:45 AM #AadiSaikumar @chagantiproducs @AjaySrinivasOFC @dev_sivashankar #AneeshSolomon #GShekar @GskMedia_PR
More Details Coming Soon! pic.twitter.com/LOWUoMSuyS
— BA Raju’s Team (@baraju_SuperHit) October 7, 2021
ఇక ఇదిలా ఉండగా తాజాాగా మరో సినిమాను లైన్ లో పెట్టాడు. తాజాగా ఆసినిమాకు సంబంధించి అఫీషియల్ ప్రకటన వచ్చింది. చాగంటి ప్రొడక్షన్స్ బ్యానర్ లో తొలి ప్రొడక్షన్ గా రూపొందనున్న ఈ సినిమా అక్టోబర్ 15న రామానాయుడు స్డూడియోస్ లో ఉదయం 9 : 45 కి ప్రారంభం కానుంది. ఈనేపథ్యంలో ఈసినిమా పోస్టర్ ను కూడా రిలీజ్ చేశాడు. ఇక ఈ సినిమాకి శివశంకర్ దేవ్ దర్శకత్వం వహించనున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: