హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1 “మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , శృతి హాసన్ జంటగా భారీ బడ్జెట్ తో తెలుగు , కన్నడ భాషలలో డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీ తో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “సలార్ “మూవీ 2022 సంవత్సరం ఏప్రిల్ 14 వ తేదీ రిలీజ్ కానుంది. హీరో ప్రభాస్ తో స్టార్ హీరోయిన్ శృతి హాసన్ ఫస్ట్ టైమ్ జంటగా నటిస్తున్నారు. మధు గురుస్వామి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. రవి బస్రుర్ సంగీతం అందిస్తున్నారు. “సలార్ ” మూవీ షూటింగ్ ప్రస్తుతం ముంబైలో శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“సలార్ ” మూవీకి నటీ నటులు, టెక్నికల్ టీమ్ విషయంలోనూ మేకర్స్ చాలా పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే “సలార్” మూవీలో ఉన్న కీలకపాత్రకై ప్రస్తుతం “ఖిలాడి ” మూవీ లో మాస్ మహారాజా రవితేజ కు జోడీగా నటిస్తున్న యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరిని ఎంపిక చేశారని సమాచారం. “ఇచ్చట వాహనములు నిలుపరాదు” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన మీనాక్షి ఆ మూవీ లో తన స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటు గ్లామర్ తోనూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మీనాక్షి ప్రస్తుతం రవితేజ “ఖిలాడి “, అడివి శేష్ “HIT 2 “మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: