సక్సెస్ ఫుల్ “నేను శైలజ “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కీర్తి సురేష్ బ్లాక్ బస్టర్ “మహానటి ” మూవీ లో లెజెండరీ యాక్ట్రెస్ సావిత్రి క్యారెక్టర్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డు అందుకున్నారు. తెలుగు , తమిళ, మలయాళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న కీర్తి సురేష్ ప్రస్తుతం “సర్కారు వారి పాట “, “భోళా శంకర్ ” “సాని కాయిధమ్ “(తమిళ ), “వాశి ” మలయాళ మూవీస్ లో నటిస్తున్నారు. కీర్తి కథానాయికగా రూపొందిన ఉమెన్ సెంట్రిక్ మూవీ “గుడ్ లక్ సఖి “ “అన్నాత్తే”(తమిళ ) “మరక్కార్ ” (మలయాళ) మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. పలు భాషల మూవీస్ తో బిజీగా ఉన్న కీర్తి ఇప్పుడు ఒక త్రి భాషాచిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సోషల్ మీడియా లో తన ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ కీర్తి సురేష్ అభిమానులను అలరిస్తున్న విషయంతెలిసిందే. ఎప్పుడూ షూటింగ్స్ తో బిజీగా ఉండే కీర్తిసురేశ్ తన స్నేహితులతో కలిసి సరదా సమయాన్ని ఎంజాయ్ చేసేందుకు ముంబైకి వెళ్ళారు. ముంబైలో ఎంజాయ్ చేస్తున్న కీర్తి తాజాగా బ్లూ డెనిమ్స్, ఫుల్ స్లీవ్‌డ్ తెలుపు రంగు చొక్కాలో చిరునవ్వులు చిందిస్తూ పూల మొక్క ముందు నిలబడిన ఫొటో ను #WednesdayVibes, #MumbaiDiaries హ్యాష్ ట్యాగ్ లతో వీకెండ్ కోసం ఎదురుచూస్తూ అంటూ ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: