యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా అగ్రహీరోలు కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. అందులో బాలకృష్ణ కూడా ఉన్నారు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ ఎంటర్‌టైనర్ ‘అఖండ’ మూవీ కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు బాలకృష్ణ. ఇక ఈసినిమా అయిపోయిన వెంటనే గోపీచంద్ మలినేనితో సినిమాను లైన్ లో పెట్టనున్నాడు బాలయ్య. ఇక ఇదిలా ఉండగా రీసెంట్ గా ఈ సినిమా టైటిల్ గురించి పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. రౌడీయిజం అనే పవర్ ఫుల్ టైటిల్ ను ఈసినిమాకు ఫిక్స్ చేసినట్టు చాలా కథనాలే వచ్చాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ వార్తలపై తాజాగా స్పందించిన మేకర్స్ టైటిల్ విషయంలో క్లారిటీ ఇచ్చారు. ఈసినిమాను నిర్మిస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వారు తమ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ఈసినిమా టైటిల్ గురించి వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు.. ఈ సినిమాపై అభిమానులకు ఎంత ఆసక్తి ఉందో దీన్నిబట్టి అర్థమవుతుంది.. టైమ్ వచ్చినప్పుడు ఈసినిమా టైటిల్ గురించి కానీ ఇంకా సినిమాకు సంబంధించిన విషయాలు కానీ మేమే చెబుతాం అంటూ స్పష్టం చేశారు.
Official announcement about #NBK107 would come as and when the time is appropriate. Do not believe in any speculations! @megopichand pic.twitter.com/p8azegPsh1
— Mythri Movie Makers (@MythriOfficial) September 15, 2021
ఇక బాలయ్య కోసం గోపీచంద్ పవర్‌ఫుల్ స్టోరీని రెడీ చేసే పనిలో ఉన్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ డెవెలప్ చేసే పనిలో ఉన్న ఆయన త్వరలోనే ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి ప్లాన్ చేస్తున్నాడు. భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ ఈసినిమాను నిర్మిస్తోంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: