శ్రీ వెంకటేశ్వర సినిమాస్ , అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్స్ పై ఫీల్ గుడ్ చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య , సాయి పల్లవి జంటగా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఆహ్లాద భరిత ప్రేమ కథా చిత్రం “లవ్ స్టోరీ” సెప్టెంబర్ 24 వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. “లవ్ స్టోరీ “చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ఫస్ట్ గ్లింప్స్ , సాంగ్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా “లవ్ స్టోరీ ” మూవీ ట్రైలర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
#LoveStory Looking good ra chay!!
All the best!! https://t.co/a2Ud4a2lQc pic.twitter.com/dBjVZLcdHM— Nagarjuna Akkineni (@iamnagarjuna) September 13, 2021
ట్రైలర్ విడుదలైన కొద్ది గంటల్లోనే 4 మిలియన్ ప్లస్ వ్యూస్‌ని రాబట్టడమే కాకుండా, 300K ప్లస్ లైక్స్‌ని సాధించింది. “లవ్ స్టోరీ” ట్రైలర్ సినీ పరిశ్రమ లో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. ట్రైలర్ ను వీక్షించిన అక్కినేని నాగార్జున స్పందించారు. అలనాటి ఎవర్ గ్రీన్ చిత్రం అయిన “ప్రేమ్ నగర్” చిత్రం పోస్టర్ ను “లవ్ స్టోరీ”పోస్టర్ తో జత చేసి, లుకింగ్ గుడ్ రా చై, ఆల్ ది బెస్ట్ అంటూ నాగార్జున ట్వీట్ చేశారు. ప్రస్తుతం నాగార్జున చేసిన ట్వీట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. అక్కినేని నాగేశ్వరరావు హీరోగా రూపొందిన “ప్రేమ్ నగర్ ” మూవీ 1971 సంవత్సరం సెప్టెంబర్ 24 వ తేదీ రిలీజ్ అయ్యింది. 50 సంవత్సరాల తరువాత నాగచైతన్య హీరోగా రూపొందిన “లవ్ స్టోరీ” మూవీ సెప్టెంబర్ 24 వ తేదీ రిలీజ్ కావడం విశేషం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.