బిగ్ బాస్ 5.. ఈసీజన్ కోసం బుల్లితెర ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈసారి కూడా కింగ్ నాగార్జుననే హోస్ట్ గా వస్తున్నాడు. ఇక ఈసీజన్ మాములుగా ఉండదని ఇప్పటికే అర్థమయిపోయింది. ఒకరిద్దరు తప్ప అందరూ మంచి పాపులారిటీ ఉన్న వాళ్లే.. అందులోనూ చాలా మంది తెలిసిన కంటెస్టేంట్సే ఉన్నారు. టన్నుల కొద్దీ కిక్కు అందించేందుకు మొత్తం 19 మంది కంటెస్టెంట్లు రెడీగా ఉన్నారు. అంతేనా దాదాపు 5 నెలల పాటు ఈ సీజన్ ను నిర్వహిస్తున్నారు. ఇందులో యాంకర్ రవి కూడా ఉన్న సంగతి తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
యాంకర్ రవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారు ఉండరు. తక్కువ కాలంలోనే రవి మోస్ట్ వాంటెడ్ యాంకర్‌గా పేరు తెచ్చుకున్నాడు. తన ఎనర్జిటిక్ యాంకరింగ్ తో.. తన స్పాంటేనియస్ తో, ముఖ్యంగా తన కామెడీతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇక రవి బిగ్ బాస్ 5లో వెళతాడా లేదా అని ఎప్పటినుండో సస్పెన్స్ తో ఉండగా ఫైనల్లీ బిగ్ బాస్ 5 లో అడుగుపెట్టేశాడు. హౌస్ లోకి వెళ్లేముందే తన కూతురు వియా ఇచ్చిన గిఫ్ట్ తో ఎమోషనల్ అయ్యాడు రవి. తన కూతురికి ఎంతో ఇష్టమైన బొమ్మను తనకు ఇచ్చినందుకు.. అంతేకాదు బాగా ఆడాలని.. రోజూ టీవీ లో చూస్తానని చెబుతూ క్యూట్ గా ఒక లెటర్ కూడా రాయడంతో రవి కంటతడి కూడా పెట్టుకున్నాడు. దీంతో ఫాదర్-డాటర్ కు మధ్య ఎంత బాండింగ్ ఉందో అర్థమవుతుంది.
ఇక ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ కు అస్సలు గ్యాప్ ఇవ్వకుండా మొదటి రోజే నామినేషన్స్ పెట్టేసి హౌస్ లో హీటు పెంచేశాడు బిగ్ బాస్. ఇక ఈవారం నామినేషన్లు పూర్తయ్యే సరికి రవి, మానస్, సరయూ, కాజల్, హమీదా, జెస్సీలకు ఎక్కువ ఓట్లు రావడంతో ఈ ఆరుగురు ఎలిమినేషన్ లో ఉన్నారు. ఇక వీరిలో అందరి సంగతి ఏమో కానీ రవి మాత్రం పక్కా సేఫ్ జోన్ లో ఉండటం ఖాయం. తనకు ఉన్న ఫాలోయింగ్ తో ఈజీగా బయటకు వచ్చేస్తాడు. నిజానికి రవి లాంటి కంటెస్టెంట్ ను బిగ్ బాస్ అంత ఈజీగా వదిలిపెట్టదు అని చెప్పొచ్చు. ఉన్న కంటెస్టెంట్స్ లో కాస్త ఎనర్జిటిక్ గా.. స్పాంటేనియస్ డైలాగ్స్ తో తన కామెడీతో పంచ్ లతో అలాగే ఫైనల్ వరకూ ఉండే క్వాలిటీస్ ఉన్న కంటెస్టెంట్ రవి. టఫ్ కాంపిటీషన్ ఇస్తాడు కాబట్టి రవిని కూడా టార్గెట్ చేసేవాళ్లు ఎక్కువగా ఉండొచ్చు. మరి ఇప్పుడే ఆట స్టార్ట్ అయింది. ఈ ఆటలో రవి ఎంత వరకూ పోరాడతాడో.. టైటిల్ వరకూ వెళతాడో లేదో ఇప్పుడే చెప్పడం కష్టం…దానికి ఇంకా కొద్ది రోజులు ఆగాల్సిందే.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: