కరుణ కుమార్ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా వస్తున్న మాస్ ఎంటర్ టైనర్ శ్రీదేవి సోడా సెంటర్.
ఇక ఈసినిమా నేడు రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈసినిమా ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుందో తెలియాలంటే మాత్రం రివ్యూలోకి వెళ్లాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నటీనటులు: సుధీర్ బాబు, ఆనంది, నరేష్, రఘుబాబు, అజయ్, సత్యం రాజేష్, హర్షవర్ధన్, సప్తగిరి, కళ్యాణి రాజు, రొహిణి, స్నేహ గుప్త, తదితరులు
డైరెక్టర్: కరుణ కుమార్
బ్యానర్: 70ఎమ్ఎమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్
నిర్మాతలు: విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి
సంగీతం: మణిశర్మ
సినిమాటోగ్రాఫర్: శ్యామ్ దత్ సైనుద్దీన్
కథ
సూరిబాబు(సుధీర్‌బాబు) ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తుంటాడు. చుట్టు పక్కల ఏ వేడుకలైనా తనే లైటింగ్, డీజే పెడుతుంటాడు. మరోవైపు ‘శ్రీదేవి సోడా సెంటర్’ యజమాని సంజీవరావు(నరేష్) కూతురు శ్రీదేవి(ఆనంది). తనను తొలిచూపులోనే చూసి ప్రేమిస్తాడు. కానీ, ఇద్దరి ప్రేమకి కులం అడ్డొస్తుంది. దీంతో పలు గొడవలు కూడా జరుగుతాయి. ఇదిలా ఉండగా ఊరి పెద్ద కాశీ (పావల్ నవగీతమ్) అనుచరుడితో గొడవ వల్ల సూరి జైలుపాలవుతాడు. ఓ హత్య కేసులో ఇరుక్కుంటాడు. ఇక సూరిబాబు బయటకు వచ్చిన తరువాత ఏం జరిగింది? సూరిబాబు-శ్రీదేవి ల ప్రేమ ఫైనల్ గా ఏమవుతుంది..? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ
సుధీర్ బాబు సినిమా కాబట్టి మొదటి నుండి మంచి అంచనాలే ఉన్నాయి. దానికి తోడు పలాస లాంటి విభిన్నమైన సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు కరుణ కుమార్. ఇక వీరిద్దరి కాంబినేషన్ అంటే మాములుగానే ఎక్స్ పెక్టేషన్స్ ఉంటాయి. నిజానికి కరుణ కుమార్ మొదటి సినిమాలో కూడా కుల వివక్షత గురించి చూపించాడు. ఇప్పుడు ఈసినిమాలో కూడా ఆ పాయింట్ ను చూపించాడు.. అయితే కాస్త డిఫరెంట్ గా చూపే ప్రయత్నం చేశాడు.
ఇక సూరిబాబుగా సుధీర్ బాబు ఎప్పటిలాగే తన నటననతో ఆకట్టుకున్నాడు. యాక్షన్ సీన్స్‌తో పాటు ఎమోషనల్ సీన్స్‌లోనూ బాగా నటించాడు సుధీర్ బాబు. సోడా కొట్టు శ్రీదేవిగా ఆనంది పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యింది. గ్లామర్ పాత్ర కాకపోయినా న్యాచురల్ యాక్టింగ్ తో ఆకట్టుకుంది. ఈ సినిమాలో హీరోయిన్ తండ్రిగా నటించిన నరేష్.. విలక్షణమైన పాత్రతో మెప్పించాడు. కూతురు కంటే కులమే ఎక్కువనుకునే పాత్రలో జీవించేశాడు. విలన్ పాత్రలో నటించిన పావల్ నవగీతమ్ కూడా తన పాత్రకు న్యాయం చేశారు. ఇక మిగిలిన నటీనటులు తమ పాత్రల మేరకు నటించారు.
ఇక మణిశర్మ తన మ్యూజిక్‌తో మరోసారి మ్యాజిక్ చేశారు. పాటలు సంగతి పక్కన పెడితే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హైలెట్ గా నిలిచింది. ఇంకో హైలెట్ ఎంటంటే విజువల్స్. సినిమాటోగ్రాఫర్ శ్యామ్ దత్ సైనుద్దీన్
అమలాపురం, కోమసీమ నేటివిటీని అద్భుతంగా చూపించాడు. ఇక ఓవరాల్ గా చెప్పాలంటే ప్రేమకథలను ఇష్టపడే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: