మనం లాంటి ఫీల్ గుడ్ మూవీ తరువాత కింగ్ నాగార్జున, నాగచైతన్య కలిసి నటించబోతున్న సినిమా బంగార్రాజు. నాగార్జున-కృష్ణ చైతన్య కాంబినేషన్ లో వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు ప్రీక్వెల్ ఈసినిమా. ఇటీవలే ఈసినిమాను పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ చేయగా.. ఈరోజు నుండి షూటింగ్ ను మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈసినిమా కోసం వేసిన ప్రత్యేకమైన సెట్ లో ఈసినిమా షూటింగ్ జరుగుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈసినిమాలో నాగార్జునకు జోడిగా రమ్యకృష్ణ.. ఇక నాగచైతన్యకు జోడీగా కృతిశెట్టి నటిస్తుంది. ఈసినిమాను నాగార్జున తన హోమ్ బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్ లో నిర్మిస్తుండగా… అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. మరి సీక్వెల్స్ కానీ.. ప్రీక్వెల్స్ కానీ సక్సెస్ అయింది చాలా తక్కువ. దానికితోడు ఈసినిమాను కూడా సంక్రాంతికే రిలీజ్ చేయాలని చూస్తున్నారట. సంక్రాంతికి చాలా పెద్ద సినిమాలే లైన్ లో ఉన్నాయి. ఈనేపథ్యంలో ఈసినిమా ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.
మరోవైపు నాగార్జున ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా చేస్తూనే ఈసినిమా షూటింగ్ లో కూడా పాల్గొననున్నాడు. ఈసినిమాలో కాజల్ అగర్వాల్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర ఎల్ఎల్‌పి – నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై నారాయణ్ దాస్ కె.నారంగ్ – పుస్కూర్ రామ్మోహన్‌రావు, శరత్ మరార్ ఈ మూవీని నిర్మిస్తున్నారు.
[subscribe]



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: