తెలుగు , తమిళ , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ లో బిజీగా ఉన్నారు. క్రిష్ దర్శకత్వంలో ఒక తెలుగు మూవీ షూటింగ్ ను కంప్లీట్ చేసిన స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం ఆయుష్మాన్ ఖురానా “డాక్టర్ జీ”, జాన్ అబ్రహాం “ఎటాక్, అజయ్ దేవగన్ “మేడే”, “థ్యాంక్ గాడ్”( హిందీ) మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.శివ కార్తికేయన్ “అయలాన్ “, కమల్ హాసన్ “ఇండియన్ 2 “(తమిళ ) మూవీస్ లో రకుల్ నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
View this post on Instagram
నటిగా చాలా బిజీగా ఉన్నా సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ రకుల్ ప్రీత్ సింగ్ తన ఫొటోస్ , వర్కౌట్ వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే.కాజల్, తమన్నా, సమంత లాంటి స్టార్ హీరోయిన్స్ డిజిటల్ ఎంట్రీ ఇచ్చి వెబ్ సిరీస్‌లతో దూసుకుపోతున్నవిషయం తెలిసిందే. ఇప్పుడు రకుల్ కామెడీ వెబ్ సిరీస్ ద్వారా డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నారు. ఎప్పుడూ పనులతో బిజీగా ఉండడమే కాదు మనసారా నవ్వేందుకు కాస్త సమయం కేటాయించండి అంటూ అభిమానులకు సూచిస్తూ తాను మనసారా నవ్వుతున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఆ ఫొటో అభిమానులను ఆకట్టుకుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

































