“లక్ష్మి కళ్యాణం “(2007 ) మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కాజల్ అగర్వాల్ తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం “ఆచార్య “ , నాగార్జున యాక్షన్ ఎంటర్ టైనర్ (తెలుగు ), “ఇండియన్ 2 “, “హే సనామికా “, హారర్ మూవీ “ఘోస్టీ “ , “రౌడీ బేబీ “ (తమిళ) మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. వివాహం తరువాత ప్రయోగాత్మక , వైవిధ్య భరిత కథలను ఎంపిక చేసుకుంటున్నారు.ప్రయోగాత్మక బాలీవుడ్ మూవీ “ఉమ”లో నటిస్తున్న కాజల్ బ్లాక్ బస్టర్ “ఖైదీ “తమిళ మూవీ హిందీ రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
14 సంవత్సరాలుగా ప్రేక్షకులను అలరిస్తున్న కాజల్ వయసు 36 సంవత్సరాలైనా తరగని అందంతో మెరిసిపోతున్నారు. కాజల్ తన గ్లామర్ సీక్రెట్ గురించి మాట్లాడుతూ .. రోజుకు కనీసం రెండు నుంచి మూడు లీటర్ల నీళ్ళు , గంటన్నర రెండుగంటలకొకసారి చొప్పున ఏడు సార్లు డైట్ తీసుకుంటాననీ , తన భోజనంలో తాజా కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, రోటీ, తేనె, గ్రీన్‌టీ వంటివే ఉంటాయనీ ,
ఉదయాన్నే వర్కవుట్ తర్వాత కొబ్బరినీళ్లు, చియా విత్తనాలు, స్ట్రాబెర్రీ వంటి వాటితో చేసిన స్మూతీ తింటాననీ , అల్పాహారంలో బ్రౌన్ బ్రెడ్, ఓట్స్, పీనట్‌బటర్, సోయా ఉంటాయనీ , లంచ్‌లో గ్రీన్‌సలాడ్, పండ్లు, బ్రౌన్ రైస్, ఆకుకూరలు తప్పనిసరిఅనీ , సాయంకాలం పండ్ల రసాలు, డిన్నర్‌లో వెజ్ సూప్, గ్రీన్‌సలాడ్ తీసుకుంటాననీ , బయటి ఫుడ్‌కు ఆమడ దూరమనీ , షూటింగ్‌కు వెళ్ళినా అమ్మ చేతి వంటనే తింటాననీ , పాల ఉత్పత్తులు, అన్నం, నిల్వ పదార్థాలు, జంక్‌ఫుడ్‌ని దగ్గరకు రానివ్వననీ చెప్పారు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: