కరోనా సెకండ్ వేవ్ వల్ల గత కొద్దిరోజులుగా థియేటర్లు మూత పడిన సంగతి తెలిసిందే కదా. ఇక
థియేటర్లు ఓపెన్ చేస్తుండటంతో పెండింగ్ లో ఉన్న సినిమాలన్నీ రిలీజ్ కు సిద్దమవుతున్నాయి. ఈనేపథ్యంలోనే ముందుగా ప్రేక్షకులను అలరించడానికి వచ్చేశాడు సత్యదేవ్ తన తిమ్మరుసు సినిమాతో. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో సత్యదేవ్ హీరోగా తెరకెక్కిన ఈసినిమా ఈరోజు విడుదలైంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ లతో సినిమాపై అంచనాలు పెంచేసిన తిమ్మరుసు.. ఎలా ఉందో తెలుసుకోవాలంటే మాత్రం రివ్యూలోకి వెళ్లాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కథ
రామచంద్ర (సత్యదేవ్) లాయర్ గా పనిచేస్తుంటాడు. తన వృత్తి పట్ల చాలా ప్యాషన్ తో అలాగే చాలా ప్రాక్టికల్ గా ఉంటాడు. ఇదిలా ఉండగా వాసు అనే వ్యక్తి ఒక మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు. ఆ తరువాత బయటకు వస్తాడు. ఈ క్రమంలో రామచంద్ర వాసు అమాయకుడని అతనికి న్యాయం చేయాలని ఎనిమిదేళ్ల తరువాత ఈ కేసును రీఓపెన్ చేస్తాడు. ఈ కేసు ప్రాసెసింగ్ లో పలు అడ్డంకులు ఎదురవుతుంటాయి. మరి వాటిని రామచంద్ర ఎలా ఎదుర్కొన్నాడు… ఫైనల్ గా వాసుకు న్యాయం ఎలా చేయగలిగాడు..? మరి అసలు నేరస్థులు ఎవరనేది ఈసినిమా కథ.
విశ్లేషణ
మొదట శరణ్ ఈ కథను చాలా బలంగా రాసుకున్నాడు. మొదటి నుండి ఈ చిత్రంలో ట్విస్టులు బాగున్నాయి అని చెబుతున్నట్టే.. శరణ్ చాలా ట్విస్ట్ లు పెట్టాడు. అలాగే గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. ఇంటర్వెల్ బ్యాంగ్.. క్లైమాక్స్ కూడా పర్ఫెక్ట్ గా సెట్ చేశాడు. దీంతో సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకూ ఆడియన్స్ లో క్యూరియాసిటీ ఉండేలా చేశాడు.
సత్యదేవ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే చాలా సినిమాల్లో చూశాం. ఈసినిమాలో కూడా లాయర్ రామచంద్ర పాత్రలో మరోసారి జీవించేశాడు. అయితే ఇప్పటివరకూ కూల్ క్యారెక్టర్స్ తో కనిపించగా.. ఈసినిమాలో యాక్షన్ సీక్వెన్స్ లో కూడా నటించి వావ్ అనిపించాడు. ముఖ్యంగా లిప్ట్ లో ఉండే ఫైట్ సీన్ సినిమాకు మరో హైలెట్ అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. వాసు పాత్రలో నటించిన అంకిత్ కొయ్య కూడా తన పాత్రలో ఒదిగిపోయాడు. ఈ సినిమా తరువాత అంకిత్ కు అవకాశాలు క్యూ కడతాయోమో. హీరోయిన్ గా చేసిన ప్రియాంక జవాల్కర్ బాగానే నటించింది. సత్యదేవ్ కు అసిస్టెంట్ గా చేసిన యాక్టర్ బ్రహ్మాజీ క్లాస్ కామెడీ సీన్స్ కడుపుబ్బా నవ్విస్తుందిఅజయ్ పోలీస్ ఇన్ఫెక్టర్ గా.. రవిబాబు మరో లాయర్ గా ఇక ఇతర నటీనటులు తమ పాత్రలు మేర నటించి మెప్పించారు.
ఇక ఈసినిమాకు మరో హైలెట్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్. శ్రీ చరణ్ పాకాల అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాను మరో లెవల్ లో నిలబెట్టాయి. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సినిమాకు తగ్గట్టే చాలా రిచ్ గా ఉన్నాయి.
ఫైనల్ గా థ్రిల్లర్ అండ్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా వచ్చిన తిమ్మరుసు ఖిచ్చితంగా అందరికీ నచ్చుతాడు. కరోనా సెకండ్ వేవ్ తరువాత వస్తున్న మొదటి సినిమా.. ఆడియన్స్ థియేటర్ కు వచ్చి చూడటానికి బెస్ట్ ఛాయిస్ ఈ తిమ్మరుసు..
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: