జాంబిరెడ్డి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటిసినిమాతోనే మంచి సక్సెస్ ను అందుకున్నాడు తేజ సజ్జా. ప్రస్తుతం తేజ తన రెండో సినిమా ఇష్క్ సినిమాతో బిజీగా ఉన్నాడు. రాజు దర్శకత్వంలో తేజ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరో హీరోయిన్లు గా ఈ సినిమా వస్తుంది. ఈసినిమా అన్ని పనులు పూర్తిచేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇక ఈనెల 30న ఈసినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టింది. ఇప్పటికే ఈ సినిమా నుండి పలు పోస్టర్ల ను, టీజర్ ను రిలీజ్ చేయగా తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Konnisarlu raavadam late Avachu emo kani ravadam maatram pakka!
July 30 nunchi me abhimana theatre la lo!🔥Here’s #ISHQ, Not a Love story💞Release Trailer
▶️https://t.co/iNdJm3axsK#ISHQFromJuly30#RBChaudhary @megaasupergood @adityamusicindia @ursvamsishekar @haashtagmedia pic.twitter.com/z4KXFq28jW— Zombie Sajja (@tejasajja123) July 27, 2021
కాగా ఆర్.బి. చౌదరి ఈ మూవీకి సమర్పకులుగా వ్యవహరిస్తున్న ఈసినిమాను ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్, వాకాడ అంజన్ కుమార్ నిర్మిస్తున్నారు. మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తుండగా.. శ్యామ్ కె. నాయుడు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. మరి వీరిద్దరూ జంటగా నటిస్తున్న ‘ఇష్క్’ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
దీనితో పాటు ప్రశాంత్ వర్మ తో రెండో సినిమా హనుమాన్ చేస్తున్నాడు. సూపర్ హీరోస్ నేపథ్యంలో డిఫరెంట్ జోనర్ లో ఈసినిమా తెరెక్కుతుంది. కాగా ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కె.నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.