ఒక స్టార్ డైరెక్టర్.. ఒక స్టార్ హీరో కాంబినేషన్ లో సినిమా అంటే ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటిది మణిరత్నం లాంటి డైరెక్టర్.. ఒకరు కాదు ఇద్దరు కాదు తమిళ్ లో ఉన్న పలు స్టార్ హీరోలతో వెబ్ సిరీస్ అంటే ఇంకా ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు. నవరసాల నేపథ్యంలో తొమ్మిది భాగాలుగా ఈ సిరీస్ రానున్న సంగతి తెలిసిందే. ఒక్కో భాగాన్ని ఒక్కో దర్శకుడు తెరకెక్కించగా… ఒక్కో ఎపిసోడ్ లో ఒక్కో నటుడు ప్రత్యేక పాత్రలో నటించారు.ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ కు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో చూశాం.. ఇప్పుడు తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Working under the guidance of Mani Sir is an honor of a life time. My dream has finally turned into a reality. Forever grateful ❤️#NavarasaOnNetflix https://t.co/dvpqPjuwIn#ManiSir #SarjunKM @JayendrasPOV @Netflix_INSouth @Atharvaamurali #Navarasa #NavarasaTrailer
— Anjali (@yoursanjali) July 27, 2021
ఇక టైటిల్‌కి తగ్గట్టుగానే అన్ని రకాల భావోద్వేగాలతో ఆద్యంతంగా ఆసక్తిగా సాగింది ఈ ట్రైలర్. ప్రతి నటుడు తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. అందరి లుక్స్ చాలా కొత్తగా ఉన్నాయి. ముఖ్యంగా నేపథ్య సంగీతం ప్రధాన బలంగా నిలిచింది. మొత్తానికి అగ్ర తారలందరినీ ఒకే వీడియోలో చూడటం నిజంగా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
కాగా సూర్య, సిద్ధార్థ్, ప్రకాశ్‌రాజ్, విజయ్ సేతుపతి, రేవతి, ఐశ్వర్యరాజేష్, అరవింద్ స్వామి, రోబో శంకర్, యోగిబాబు, అంజలి కీలక పాత్రల్లో నటిస్తున్న ఈసిరీస్ ను రతీంద్రన్ ఆర్. ప్రసాద్, అరవింద్ స్వామి, బిజోయ్ నంబియార్, గౌతమ్ వాసుదేవ మీనన్, సర్జున్ కె.ఎం, ప్రియదర్శన్, కార్తీక్ నరేన్, కార్తీక్ సుబ్బరాజ్, వసంత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆగస్టు 6 నుంచి ప్రముఖ ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్’ వేదికగా స్ట్రీమింగ్ కానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: