పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో రష్మిక తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. రష్మిక కథానాయికగా రూపొందుతున్న 2 టాలీవుడ్ , 2 బాలీవుడ్ మూవీస్ సెట్స్ పై ఉన్నాయి . సుకుమార్ దర్శకత్వంలో రెండు భాగాలుగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “, శర్వానంద్ హీరోగా రూపొందుతున్న “ఆడాళ్ళూ మీకు జోహార్లు ” మూవీస్ లో రష్మిక కథానాయికగా నటిస్తున్నారు. స్పై థ్రిల్లర్ “మిషన్ మజ్ను ” మూవీ తో రష్మిక బాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అవుతున్నారు. బిగ్ బీ అమితాబ్ , రష్మిక ప్రధాన పాత్రలలో తండ్రీ కూతుళ్ళ నేపథ్యం లో “గుడ్ బై “బాలీవుడ్ మూవీ తెరకెక్కుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరోయిన్ రష్మిక ఆదివారం ముంబై లో జరుగుతున్న “మిషన్ మజ్ను ” మూవీ షూటింగ్ లో పాల్గొన్నారు. ఈ రోజు(సోమవారం )రష్మిక హైదరాబాద్ లో జరుగుతున్న “ఆడాళ్ళూ మీకు జోహార్లు ” మూవీ షూటింగ్ లో జాయిన్ అవుతున్నారు. షూటింగ్స్ తో బిజీగా ఉన్నా రష్మిక సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూతన ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ, అభిమానులను అలరిస్తున్నారు. 19 మిలియన్ ఫాలోవర్స్ తో రష్మిక ఇన్స్టాగ్రామ్ లో దూసుకుపోతున్నారు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: