షూటింగ్ పూర్తిచేసుకున్న ‘శ్యామ్ సింగ రాయ్’

Natural Star Nani Starrer Shyam Singha Roy Movie Team Successfully Wraps Up Shooting Work,Shyam Singha Roy Shoot Wrapped,Shyam Singha Roy Shoot Wrapped Up,Nani And Sai Pallavi Shyam Singha Roy Shoot Wrapped,Nani And Sai Pallavi New Movie,Nani Wraps Up Shyam Singha Roy,Nani Wraps Up Shooting For Shyam Singha Roy,Shyam Singha Roy Movie Shooting Update,Shyam Singha Roy Movie Team Wraps Up Shooting Work,Shyam Singha Roy Shoot Wrapped,SSR Shoot Wrapped,SSR,Nani SSR Shoot Wrapped,Shyam Singha Roy Movie Shoot Wrapped,Nani Shyam Singha Roy Movie,Shyam Singha Roy Update,Shyam Singha Roy Movie Latest Updates,Telugu Filmnagar,Nani,Actor Nani,Hero Nani,Natural Star Nani,Nani Shyam Singha Roy,Natural Star Nani Shyam Singha Roy Movie,Nani Latest News,Nani Movies,Nani New Movie,Nani Latest Movie,Nani Next Movie,Shyam Singha Roy,Shyam Singha Roy Movie,Shyam Singha Roy Telugu Movie,Shyam Singha Roy Movie Latest News,Sai Pallavi,Nani And Sai Pallavi Movie,Sai Pallavi New Movie,Sai Pallavi Movies,Sai Pallavi Shyam Singha Roy,Nani New Look,Nani New Movie Updates,Nani Shyam Singha Roy Movie Shoot,Shooting Wrapped Up For Shyam Singha Roy Movie,Nani And Sai Pallavi Shyam Singha Roy Shoot Wrapped,Shyam Singha Roy Movie Shoot Completed,Nani Shyam Singha Roy Shooting Completed,#ShyamSinghaRoy,#SSRShootWrapped

గత ఏడాది వి సినిమాతో అలరించిన న్యాచురల్ స్టార్ నాని ఈ ఏడాది కూడా విభిన్నమైన సినిమాలతో వచ్చేస్తున్నాడు. వాటిలో ‘శ్యామ్ సింగరాయ్‌‘ ఒకటి. టాక్సీవాలా దర్శకుడు రాహుల్‌ సంక్రీత్యన్ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమా చాలా వరకూ కలకత్తా లోనే షూటింగ్ జరుపుకుంది.అయితే కరోనా సెకండ్ వేవ్ వల్ల మళ్లీ అక్కడికి వెళ్లలేని పరిస్థితి రావడంతో ఇక్కడే ప్రత్యేకమైన భారీ సెట్ వేసి మరీ షూటింగ్ ను జరిపారు. ఇక కొన్నిరోజులు గ్యాప్ ఇచ్చిన ఈసినిమా ఇటీవలే లాస్ట్ షెడ్యూల్ ను స్టార్ట్ చేశారు. ఇక సెట్ లో షూటింగు కావడం వల్ల తగిన జాగ్రత్తలు పాటిస్తూ షూటింగు కానిచ్చారు. ఈ కారణంగానే ఈ సినిమాను అనుకున్న సమయానికి పూర్తిచేయగలిగారు. ఇక ఫైనల్ గా ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేశారు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా తెలియజేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో సాయిప‌ల్లవి, కృతి శెట్టి, మ‌డోన్నా సెబాస్టియ‌న్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నిహారిక ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై వెంక‌ట్ ఎస్‌. బోయ‌న‌ప‌ల్లి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మ‌‌డోన్నా సెబాస్టియ‌న్, రాహుల్ ర‌వీంద్ర‌న్‌, ముర‌ళీ శ‌ర్మ కీల‌క పాత్రల్లో నటిస్తున్నారు. మిక్కీ జే మేయ‌ర్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ కాగా.. స‌ను జాన్ వ‌ర్ఘీస్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా, న‌వీన్ నూలి ఎడిట‌ర్‌గా ప‌ని చేస్తున్నారు.

మరోవైపు శివ నిర్వాణ దర్శకత్వంలో నాని హీరోగా ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా “టక్ జగదీష్” సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా ఎప్పుడో షూటింగ్ ను పూర్తిచేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. రీతువర్మ, ఐశ్వర్యా రాజేష్ కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాను… సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇంకా అంటే సుందరానికి సినిమా కూడా చేస్తున్నాడు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × four =