‘ఒక్కడు’, ‘వర్షం’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’. లాంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలను టాలీవుడ్ కు అందించిన నిర్మాత ఎం.ఎస్ రాజు. ఆతరువాత కొంత కాలంగా సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఎం.ఎస్ రాజు మళ్లీ ‘డర్టీ హరి’ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్నే దక్కించుకున్నారు. ఇప్పుడు 7 డేస్ 6 నైట్స్ అంటూ మరో యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ తో వచ్చేస్తున్నాడు. రీసెంట్ గానే ఈసినిమా హైద్రాబాద్ లో ఈసినిమా షూటింగ్ ను స్టార్ట్ చేసింది. హైద్రాబాద్ తరువాత గోవా, మంగళూరు, అండమాన్ నికోబార్ దీవుల్లో షెడ్యూల్స్ ను ప్లాన్ చేసుకున్నట్టు ఇప్పటికే తెలిపారు. ఇక ఇదిలా ఉండగా నేడు ఈసినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయనిట్. ఇక ఫస్ట్ లుక్ చూస్తుంటే చాలా కూల్ అండ్ ఫ్రెష్ ఫీలింగ్ కలుగుతుంది. అయితే ఇప్పటివరకూ నటీనటుల గురించి చెప్పలేదు కానీ హీరో మాత్రం తనయుడు సుశాంతే అనిపిస్తుంది. హీరోయిన్ పేరు త్వరలో వెల్లడిస్తారేమో చూడాలి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Get ready for a cherishing trip of love n life, here’s the First Look of our #7Days6Nights 💕✨@SumanthArtPro @MSumanthAshwin @RajnikantSOffl @SamarthGollapu5 @EditorJunaid @WildHoneyPro #WintagePictures @AbgCreations @PulagamOfficial pic.twitter.com/S2TLciefGY
— MS Raju (@MSRajuOfficial) July 22, 2021
ఈసినిమాను వైల్డ్ హనీ ప్రొడక్షన్స్ లో సుమంత్ అశ్విన్, వింటేజ్ పిక్చర్స్ మరియుఏబిజి క్రియేషన్స్ బ్యానర్స్ పై రజనీకాంత్ .ఎస్ తో కలిసి సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈసినిమాకు సమర్థ్ గొల్లపూడి సంగీతం అందిస్తుండగా నాని చమిడి శెట్టి సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. సెప్టెంబర్ లో సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.