“పెళ్ళిచూపులు “మూవీ సక్సెస్ తో హీరో గా ఎస్టాబ్లిష్ అయిన విజయ్ దేవరకొండ సెన్సేషనల్ హిట్ “అర్జున్ రెడ్డి “మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి విజయ్ దేవరకొండ బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకుని క్రేజీ హీరోగా మారారు. బ్లాక్ బస్టర్ “గీత గోవిందం” మూవీ తో స్టార్ డమ్ అందుకున్నారు. సూపర్ హిట్ “టాక్సీవాలా “మూవీతో విజయ్ ప్రేక్షకులను అలరించారు. విజయ్ హీరోగా రూపొందిన కొన్ని మూవీస్ నిరాశ పరచినా అభిమానులలో విజయ్ పై క్రేజ్ తగ్గలేదు. విజయ్ ప్రస్తుతం తెలుగు , హిందీ భాషలలో రూపొందుతున్న “లైగర్ “మూవీ లో కథానాయకుడిగా నటిస్తున్న విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరో విజయ్ దేవరకొండ సోషల్ మీడియా లో దూసుకుపోతున్నారు. ఇన్ స్టా గ్రామ్ లో 12. 5 మిలియన్ ఫాలోవర్స్ పైగా సొంతం చేసుకుని సౌత్ ఇండియాలోనే నంబర్ 1 హీరోగా రికార్డ్ సృష్టించిన విజయ్, ఇప్పుడు ఫేస్‌బుక్‌లో కూడా 10 మిలియన్ ఫాలోవర్స్ తో రికార్డ్ క్రియేట్ చేశారు. విజయ్ క్రేజ్ రోజురోజుకీ పెరిగిపోతోంది. ఇప్పటికే పాన్ఇండియా స్థాయిలో ఆయన పేరు వినబడుతోన్న విషయం తెలిసిందే. అలాగే బాలీవుడ్ హీరోయిన్ లలో ప్రతీ ఒక్కరూ విజయ్ పేరే చెబుతుండడం విశేషం. విజయ్ తన ఫేస్‌బుక్‌లో 10 మిలియన్ క్లబ్‌లోకి చేరిన ట్యాగ్‌ని ఆయన అభిమానులు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: