మారుతి దర్శకత్వంలో యువ హీరో సంతోష్ శోభన్ తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా.. మెహ్రీన్ ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈసినిమాకు మంచి రోజులు వచ్చాయి అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు గత కొద్దిరోజులుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇక తాజాగా అదే టైటిల్ ను ఖరారు చేస్తూ ఈ మూవీ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు మేకర్స్. నిజజీవిత పాత్రల స్పూర్తిగా ఈ యూత్‌ఫుల్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు ఫస్ట్ లుక్ ద్వారా తెలియజేశారు. మెహరీన్ కౌర్, సంతోష్ శోభన్ ఇద్దరూ కూల్ గా ఉన్న ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ మాత్రం ఆకట్టుకుంటుంది. అంతేకాదు ఈ సినిమా త్వరలోనే థియేటర్లలో రిలీజ్ చేయనున్నామని కూడా తెలిపారు.కాగా ఎస్కేఎన్-వీ సెల్యూలాయిడ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Presenting, the first look of #ManchiRojulochaie 😊
As quick as I made up my mind, this happened! Will entertain you soon in healthy Theatres! ✨@santoshshobhan @Mehreenpirzada @vcelluliodsoffl @SKNonline @UVConcepts_ @MassMovieMakers @anuprubens #SaiSriram @IamEluruSreenu pic.twitter.com/Uwpor0skrN
— Director Maruthi (@DirectorMaruthi) July 20, 2021
ఇక మరోవైపు గోపీచంద్ తో పక్కా కమర్షియల్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా కూడా రిలీజ్ కు రెడీ అవుతుంది. మరోవైపు సంతోష్ శోభన్ ప్రస్తుతం సారంగ ప్రొడక్షన్స్ బ్యానర్ లో అభిషేక్ మహర్షి అనే నూతన దర్శకుడితో ఒక సినిమా చేస్తున్నాడు. ఇటీవలే ఈసినిమా ఫస్ట్ లుక్, టైటిల్ ను రిలీజ్ చేశారు. ప్రేమ్ కుమార్ అనే టైటిల్ తో ఈసినిమా తెరకెక్కుతుంది.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























