దేశవ్యాప్తంగా ఎదురుచూస్తున్న ఇంట్రెస్టింగ్ ఫిలింస్ లో రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా కూడా ఒకటని చెప్పొచ్చు. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో పడింది. మరోవైపు రాజమౌళి చిన్నగా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టాడు. ఇక ప్రమోషన్స్ లో ఎప్పుడూ రాజమౌళి డిఫరెంట్ గా తమ మార్క్ ను చూపిస్తాడన్న సంగతి తెలిసిందే. బాహుబలి సినిమా టైమ్ లో ఒక్కో క్యారెక్టర్ ను రివీల్ చేస్తూ సినిమాపై ఎంత హైప్ పెంచాడో అందరికి తెలుసు. ఆ తరువాత చాలామంది అదే ఫార్మట్ ను ఫాలోఅవుతున్నారు. ఇక ఆర్ఆర్ఆర్ ప్రమోషన్ లో కూడా రాజమౌళి చాలా కొత్తగా వస్తున్నట్టు అర్థమవుతుంది. ఈనేపథ్యంలోనే ఈసినిమా ప్రమోషన్ కోసం ఒక స్పెషల్ సాంగ్ ను ప్లాన్ చేస్తుండగా.. అందులో తన హీరోస్ అందరినీ చూపించనున్నాడట. ఎన్టీఆర్, రామ్ చరణ్ తో పాటు ప్రభాస్, రవితేజ, నితిన్, సునీల్ లు ఈ సాంగ్ లో కనిపించనున్నారట. సినిమా రిలీజ్ కు కొద్దిరోజుల ముందు ఈసాంగ్ ను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. మరి ఇది నిజమే అయితే ఖచ్చితంగా రాజమౌళి ప్రమోషన్స్ లో మరో ట్రెండ్ సెట్ చేసినట్టే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత చరిత్రలను ఆధారం చేసుకొని రాజమౌళి ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఇండియన్ సినిమాల్లో వస్తున్న అతి పెద్ద సినిమాల్లో ఈ సినిమా కూడా ఒకటి. ఇప్పటికే రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్ పేరుతో విడుదల చేసిన మేకింగ్ వీడియో సినిమాపై అంచనాలు పెంచుతోంది. దీనితో పాటు సినిమాను అక్టోబర్ 13న విడుదల చేయనున్నట్లు మరోసారి అధికారికంగా ప్రకటించారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: