ఒకప్పుడు చాక్లెట్ బాయ్ లా కనిపించిన రామ్ ఈ మధ్య ఫుల్ మాస్ హీరోగా మారిపోయాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమాలో మాస్ క్యారెక్టర్ లో అలరించిన రామ్.. ఆ తర్వాత వచ్చిన రెడ్ సినిమాలో కూడా అదే కంటిన్యూ చేసాడు. ఇప్పుడు ఎన్.లింగుస్వామి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ‘రాపో 19’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. నిన్నటి నుండి ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టింది. ఇక ఇప్పటికే ఈసినిమాకు ‘ఉస్తాద్’ అనే పేరును చూస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఈసినిమాలో నటించే విలన్ గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. గతంలోనే తమిళ్ స్టార్ హీరో మాధవన్ హీరోగా నటిస్తున్నాడని వార్తలు రాగా దానిపై స్పందించిన మాధవన్ తను ఆసినిమాలో చేయడంలేదని క్లారిటీ ఇచ్చాడు. అయితే ఇప్పుడు విలన్ గా ఆర్యన్ పేరు వినిపిస్తుంది. ఆర్యన్ ను విలన్ గా ఎంపిక చేయనున్నట్టు తెలుస్తుంది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే మాత్రం అధికారికంగా ప్రకటన వచ్చేంతవరకూ ఆగాల్సిందే. కాగా గతంలో ఆర్యన్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన వరుడు సినిమాలో విలన్ గా నటించాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా నిర్మాత శ్రీనివాస్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్ వాల్యూస్‌తో తెలుగు, తమిళ భాషల్లో ప్రెస్టీజియస్‌గా తెరకెక్కించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: