ఇండస్ట్రీలోకి వారసుల ఎంట్రీ కామన్. ఇప్పటికే ఎంతో మంది హీరోలు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తమ ప్రత్యేకతను చాటుకుంటూ సినిమా చేసుకుంటూ వెళుతున్నారు. సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన ప్రిన్స్ మహేష్ బాబు తనకంటూ స్పెషల్ గా స్టార్ ఇమేజ్ క్రియేట్ చేసుకుని టాలీవుడ్ లో సత్తా చాటుతున్న విషయం తెలిసిందే. ఆ తరువాత కృష్ణ ఫ్యామిలీ నుంచి సుధీర్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అతను కూడా వైవిధ్యమైన చిత్రాలతో ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి మరో యంగ్ హీరో ఎంట్రీకి సిద్ధమయ్యాడు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, జయదేవ్ గల్లా తనయుడు అశోక్ గల్లా “హీరో”తో వెండితెర ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. అయితే ఈసినిమా టైటిల్ టీజర్ ను రెండు రోజుల క్రితం రిలీజ్ చేసిన సంగతి తెలిసిందేకదా. తాజాగా ‘హీరో’ టైటిల్ టీజర్ 4 మిలియన్ వ్యూస్ దాటేయడంతో చిత్రబృందం సెలెబ్రేషన్స్ చేసుకున్నారు. ఈ సెలెబ్రేషన్స్ కు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. మరి టైటిల్ టీజర్ తోనే భక్తి బజ్ క్రియేట్ చేసిన “హీరో” రానున్న రోజుల్లో ఇంకెన్ని రికార్డులు సెట్ చేస్తాడో చూడాలి.
Team #𝐇𝐄𝐑𝐎 celebrating the overwhelming response for the #HeroTitleTeaser with 4M+ Views🔥💥.
Watch ICYMI▶️ https://t.co/G8dYN3usKF@AshokGalla_ @SriramAdittya #PadmavathiGalla @AgerwalNidhhi @IamJagguBhai @JayGalla @ravipatic @GhibranOfficial @amararajaent @WhackedOutMedia pic.twitter.com/ChsDkr0qTm
— Telugu FilmNagar (@telugufilmnagar) June 25, 2021
కాగా ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రంలో జగపతి బాబు, నరేష్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ గిబ్రాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. గల్లా జయదేవ్ సొంత ప్రొడక్షన్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: