గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని, శ్రద్ధ శ్రీనాథ్ హీరోహీరోయిన్లు గా తెరకెక్కిన సినిమా జెర్సీ. 2019 ఏప్రిల్ 19న విడుదలైన ఈ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రావడమే కాదు… విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. ఇక నాని నటన గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. తన న్యాచురల్ నటనతో నవ్విస్తాడు… ఏడిపిస్తాడు అందుకే న్యాచురల్ స్టార్ అన్న బిరుదును సొంతం చేసుకున్నాడు. ఈసినిమాలో కూడా నాని తన ఎమోషన్ తో ప్రేక్షకులను కంటతడి పెట్టిసాడు. నానికి కొడుకుగా చేసిన రోనిత్, హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ కూడా చాలా బాగా నటించారు. సత్యరాజ్, రావు రమేష్, ప్రవీణ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఇటీవలే ఈసినిమా జాతీయ అవార్డ్ ను సైతం దక్కించుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక సినిమాను హిందీ లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసందే. షాహిద్ కపూర్ నటిస్తున్న ఈసినిమా షూటింగ్ కూడా ఎప్పుడో మొదలైంది. కానీ కరోనా వల్ల ఇంతవరకూ రిలీజ్ కాలేకపోయింది. ఇదిలా ఉండగా తాజాాగా సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో కనెక్ట్ అయిన షాహిద్ కపూర్ ఈసినిమా గురించి మాట్లాడుతూ… “కబీర్ సింగ్ చేయక ముందే ‘జెర్సీ’ సినిమా చూశాను. లేట్ సక్సెస్ గురించి చెప్పే ‘జెర్సీ’ కథతో రిలేట్ అయ్యాను అని తెలిపాడు. అంతేకాదు ఈ సందర్భంగా హీరో నాని పై ప్రశంసలు కురిపించాడు. ‘నాని ఆ పాత్రలో చాలా బాగా నటించాడు.. సినిమా చూస్తున్నప్పుడు 4-5 సార్లు ఏడిపించాడు’.. షాహిద్ చెప్పుకొచ్చాడు.
కాగా ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేయేషన్స్ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై బాలీవుడ్ నిర్మాత అమన్ గిల్ తో కలిసి అల్లు అరవింద్, దిల్ రాజు, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: