ఆర్ఎక్స్ 100 సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కార్తికేయ ఆసినిమా తరువాత ఆస్థాయిలో విజయాన్ని దక్కించుకోలేదు. కానీ ఈయంగ్ హీరోకు మాత్రం అఫర్స్ కు లోటు లేదు. అవకాశాలు వస్తూనే ఉన్నాయి. అది పెద్ద పెద్ద బ్యానర్లలోనే సినిమాలు చేస్తున్నాడు. ఇటీవలే చావు కబురు చల్లగా సినిమాతో అలరించగా.. ప్రస్తుతం కార్తికేయ శ్రీ సరిపల్లి దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇది కార్తికేయ నటిస్తున్న 7వ సినిమా. ఇందులో ఆయన ఎన్ఐఏ ఆఫీసర్ గా నటిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈసినిమా నుండి అప్ డేట్ రాబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఈసినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. రేపుఅంటే జూన్ 20 న మధ్యాహ్నం 12.15 నిమిషాలకు అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగా చేతుల మీదుగా ఫస్ట్ లుక్, టైటిల్ ను రిలీజ్ చేయనున్నారు. కాగా తాన్యా రవిచంద్రన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. టి.ఆదిరెడ్డి సమర్పణలో రామారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు
Thank you so much @imvangasandeep sir 🤗🤗 https://t.co/amqmGTw4sO
— Kartikeya (@ActorKartikeya) June 19, 2021
మరోవైపు సుకుమార్ బ్యానర్లో కూడా ఒక సినిమా చేస్తున్నాడు. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈసినిమాకు కథ, స్క్రీన్ ప్లే, సంభాషణలు సుకుమార్ అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
































