మెగాస్టార్ చిరంజీవి – దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఆచార్య. ఈసినిమాలో రామ్ చరణ్ కూాడా కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా షూటింగ్ కూడా చివరి దశలో ఉంది. కరోనా సెకండ్ వేవ్ లేకపోత్ ఇప్పటికే ఈసినిమా రిలీజ్ కూడా అయి ఉండేది. ఇక ఒక రెండు మూడు వారాల షూటింగ్ మాత్రమే ఉండగా త్వరలోనే షూటింగ్ ను రీస్టార్ట్ చేసి అది కూడా పూర్తి చేయనున్నారు. ఇక ఇదిలా ఉండగా ఈసినిమా నుండి ఇప్పటికే పలు పోస్టర్లు రిలీజ్ అయిన సంగతి తెలిసిందే కదా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ముఖ్యంగా ఇద్దరు స్టార్ హీరోలకు సంబంధించిన లుక్స్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. కాగా పూజా హెగ్డే కు సంబంధించి తన పాత్రకు సంబంధించి ఎలాంటి లుక్ ను రిలీజ్ చేయలేదు. అయితే నిన్న కొరటాల శివ పుట్టినరోజు సందర్భంగా సినీ స్టార్స్ అంతా కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ వచ్చారు. అలాగే పూజా హెగ్డే కూడా కొరటాలతో దిగిన ఫోటో ని పోస్ట్ చేస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. కొరటాలకు ఫొటోస్ దిగడం అంటే ఇష్టం ఉండదని… తన బలవంతం మీదనే ఫొటోస్ దిగాడని చెప్పుకొచ్చింది పూజ. ఇక ఫోటోలో లంగా ఓణీ లో పూజ హెగ్డే పల్లెటూరి అమ్మాయిలా కనిపిస్తుంది. మొత్తంగా ఈ ఫోటో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.
Happy Birthday @sivakoratala sir! I know how awkward you are when it comes to taking pictures of yourself, but thank you for graciously granting my request! 😂 Hope this year is filled with love, luck and BLOCKBUSTERS 😃See you on set soon! 🤞🏼🤞🏼 #Acharya pic.twitter.com/ya4uIKpsMe
— Pooja Hegde (@hegdepooja) June 15, 2021
కాగా కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. సిద్ధ అనే విద్యార్థి నాయకుడు పాత్రను పోషిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: