‘ది ఫ్యామిలీ మ్యాన్’ అమెజాన్ ప్రైమ్ లో వచ్చిన ఈ వెబ్ సిరీస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మనోజ్ బాజ్‌పెయ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో స్పై థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈ వెబ్ సిరీస్ మంచి హిట్ అయింది. దీంతోనే ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 ను కూడా తీసుకొచ్చారు. ఈ వెబ్ సిరీస్ కూడా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది కానీ కరోనా వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ రావడంతో అంచనాలు కూడా పెరిగాయి. ఎట్టకేలకు నేడు అమెజాన్ లోకి వచ్చేసింది. ఇక ఎప్పటినుండో ఈసీజన్ కోసం ఎదురుచూస్తున్న వాళ్లు సిరీస్ రిలీజ్ అవ్వడంతో పండగ చేసుకుంటున్నారు. అయితే మరోవైపు పలు వివాదాలు కూడా తెరపైకి వచ్చాయి. మరి ఈసిరీస్ ఎలా ఉంది.. వివాదాలు తలెత్తే అంశాలు ఉన్నాయా లేదా అన్నది తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మొదటి సీజన్ లో గ్యాస్ లీకేజ్ కు అందుకు ప్లాన్ లు సిద్దం చేయడం.. సుబ్బు అనే టెర్రరిస్ట్ దీనిని అమలు చేయడం.. ఫైనల్ గా ఢిల్లీలోని గ్యాస్ లీక్ ఘటనతో ముగుస్తుంది. ఇక రెండో సీజన్ ముఖ్యంగా శ్రీలంక తమిళులపై ఫోకస్ చేశారు. శ్రీలంకలో తమిళ నాయకుడు భాస్కరన్ దళాన్ని అంతం చేసేందుకు ఇండియా సాయంచేస్తుంది. ఇంతలో భాస్కరన్ అక్కడినుంచి తప్పించుకుంటాడు. మరోవైపు భాస్కరన్ తమ్ముడు సుబ్బును కోర్టులో ప్రవేశ పెట్టే సమయంలో పాకిస్తాన్ మేజర్ సలీం ప్లాన్‌లో భాగంగా బాంబ్ బ్లాస్ట్‌లో మరణిస్తాడు. దీంతో ఇండియాపై పగను పెంచుకున్న భాస్కరణ్, పాకిస్తాన్ మేజర్ సమీర్‌తో కలిసి.. భారత ప్రధాని పై దాడి చేసేందుకు ప్లాన్ చేస్తాడు. మరోవైపు శ్రీకాంత్ తివారి తన సీక్రెట్ ఏజెంట్ టాస్క్ ఉద్యోగాన్ని వదిలి ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో జాయిన్ అవుతాడు. తనకు ఇష్టం లేకపోయినా ఫ్యామిలీ కోసం ఉద్యోగం చేస్తుంటాడు. ఇలా సాగిపోతున్న శ్రీకాంత్ లైఫ్‌లో.. ప్రధానిపై దాడికి పాల్పడుతున్నట్లు తెలుస్తుంది. దీంతో సాప్టవేర్ జాబ్ వదిలి మళ్లీ టీంలో జాయిన్ అవుతాడు. మరోవైపు రాజీ (సమంత) పలు హత్యల కేసులో నిందితురాలుగా ఉంటుంది. ఈ హత్యల కేసులో మనోజ్ భాజ్ రాజీని కలిసేందుకు వెళ్తారు. అసుల రాజీ ఎవరు..? రకరకాల సమస్యల నడుమ టాస్క్ కు చెందిన శ్రీకాంత్ తివారి, జెకె తమ టార్గెట్ ను ఎలా ఛేదించారు? అనేదే ఈ తొమ్మిది ఎపిసోడ్స్ వెబ్ సీరిస్ కథ..
ఇలాంటి సిరీస్ లను తెరకెక్కించాలంటే ఎంతో జాగ్రత్తగా కథను రెడీ చేసుకోవాలి. ఎందుకంటే ముందు సీజన్ అంత హిట్ అయిన తరువాత.. అంచనాలు పెరిగిన తరువాత ఆ ప్రెజర్ ఇంకా ఉంటుంది. ఎక్కడా విసిగించకూడదు.. స్లో అవ్వకూడదు. ఇక ఈ సీజన్ 2 ను కూడా అంచనాలకు తగినట్లుగానే మేకర్స్ రాజ్ అండ్ డీకే సీజన్ 2 తెరకెక్కించారు. కథనాన్ని వేగంగా తీర్చిదిద్ది ఆకట్టుకున్నారు.
ఒక్కో చిక్కు ముడిని ఎపిసోడ్ చివర్లో విప్పేస్తుంటారు.అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెరకెక్కించారు. నేపథ్య సంగీతం, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ అన్నీ కూడా పండాయి.
ఈ సిరీస్ కు ప్రధాన పాత్ర శ్రీకాంత్ తివారిగా చేసిన మనోజ్ బాజ్. తను సీజన్ వన్ లో ఎలా పాత్రలో జీవించాడో సెకండ్ సీజన్ లో కూడా అవలోకగా చేసుకుంటూ వెళ్లిపోయాడు. పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌ను బ్యాలెన్స్ చేయడానికి పడిన కష్టం అటు వినోదాత్మకంగా చూపిస్తూనే. వృత్తి పట్ల ఉన్న ప్యాషన్ ను చూపించారు. ప్రియమణి పాత్ర మొదటి సీజన్ తో పోల్చుకుంటే ఈ సీజన్ లో కాస్త తక్కువగానే ఉందని చెప్పొచ్చు.
ఇక ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 పై క్రేజ్ రావడానికి మరో కారణం సమంత కూడా అని చెప్పొచ్చు. ఈసిరీస్ తోనే తొలిసారి ఆమె డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి అడుగుపెట్టింది. శ్రీలంక ఆర్మీ చేతిలో అన్యాయానికి గురైన తమిళుల ప్రతినిధిగా సమంతా జీవించారు. ఇక ఈపాత్రలో సమంత ప్రాణం పెట్టిందనే చెప్పాలి. నిజానికి సమంతను చాలా చిలిపి పాత్రలలోనే ఊహించుకుంటాం. కానీ ఈ సిరీస్ లో అలాంటి ఎక్స్ ప్రెషన్స్ కు తావు లేదు. దాదాపు సీరియస్ గా ఉండే ఎక్స్ ప్రేషన్స్ నే మైన్ టైన్ చేయాలి. కళ్ళతోనే చాలా వరకూ తన భావాలను ప్రకటించే ప్రయత్నం చేసింది. సమంతపై చిత్రీకరించిన యాక్షన్ సన్నివేశాలు వెబ్ సీరిస్ కు హైలైట్ అని చెప్పాలి. కాటన్ మిల్ కార్మికురాలిగా… లైంగిక వేదింపులను మౌనరోదనతో భరించడం, చివరకు అవతలి వారికి తగిన బుద్ధి చెప్పడం, ఆ క్రమంలో పోలీసులను తప్పించుకోవడానికి పడే పాట్లు… ఇవన్నీ ఆసక్తికరంగా ఉన్నాయి. మరోవైపు సమంత పాత్రపై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారమని సిరీస్ చూస్తే తెలిసిపోతుంది. తమిళనాడు, తమిళ ప్రజలకు వ్యతిరేకంగా ఆమె నటించలేదని తేలిపోయింది.
ఇక భారత ప్రధాని బసు పాత్రను సీమా బిస్వాస్ తో చేయించడం బాగుంది. ఇక ఇతర ప్రధాన పాత్రల్లో మైమ్ గోపీ, అళగమ్ పెరుమాళ్, షరీబ్ హష్మీ, ఆశ్లీష ధాకూర్, దలిప్ తహిల్, పవన్ చోప్రా, ఆనంద్ సమి తదితరులు వారి పాత్ర మేర నటించారు.
ఓవరాల్ గా చెప్పాలంటే సీజన్1 ను మించిన థ్రిల్లింగ్ తో సీజన్2 ను తెరకెక్కించారు దర్శకులు. అంతేకాదు సీజన్ 3ను కూడా తీసుకురానున్నట్టు హింట్ ఇచ్చేశారు. మరి అది ఎప్పుడు వస్తుందో చూద్దాం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: