‘ఆకాశవాణి’ రిలీజ్ డేట్ కూడా వాయిదా

Aakashavani Movie Release Date Gets Postponed,Telugu Filmnagar,Telugu Movie News 2021,The World of Aakashavaani,Aakashavaani,Aakashavaani Movie,Aakashavaani Telugu Movie,Aakashavaani Update,Aakashavaani Movie Updates,Aakashavaani Telugu Movie Updates,Aakashavaani Movie News,Aakashavaani Movie Latest Updates,Aakashavaani Movie New Update,Aakashavaani Release Date,Aakashavaani Movie Release Date,Aakashavaani Release Date Postponed,Aakashavaani Movie Release Date Postponed,Aakashavani Release Date Gets Postponed,Aakashavani Postponed,Aakashavani Movie Postponed,Aakashavani Movie Postponed News,Aakashavaani Has Been Postponed,Ashwin Gangaraju,P Samuthirakani,Samuthirakani,Aakashavani Movie Release Date Update,Aakashavani Release Date Update,Aakashavani Release Postponed,Ashwin Gangaraju Aakashavani,Samuthirakani Movies,Samuthirakani Aakashavani,Aakashavaani Telugu Movie Postponed,#Aakashavaani

గత ఏడాది కరోనా వల్ల ఎన్నో సినిమాలు పెండింగ్ లో పడగా అందులో కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి. జనవరిలో నుండి మార్చి వరకూ కాస్త సినిమాల రిలీజ్ లతో థియేటర్ల వద్ద సందడి నెలకొంది. ఇంకా పలు సినిమాలు పెండింగ్ లోనే ఉన్నాయి. ఈలోపే కరోనా సెకండ్ వేవ్ మళ్లీ విజృంభింతడంతో థియేటర్లు మూతపడ్డాయి. దీంతో మళ్లీ పలు సినిమాల రిలీజ్ డేట్ లు వాయిదా పడిన సంగతి తెలిసిందే కదా.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక లిస్ట్ లో ఆకాశవాణి సినిమా కూడా చేరింది. అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో ఆకాశవాణి సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. రాజమౌళి దగ్గర పలు సినిమాలకు పని చేశాడు అశ్విన్ గంగరాజు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ ను పూర్తి చేసుకుంది కానీ రిలీజ్ కు నోచుకోలేదు. ఇక మళ్లీ ఈసినిమా రిలీజ్ వాయిదా వేస్తూ ప్రకటించారు చిత్రయూనిట్. పరిస్థితులు సాధారణంగా ఉండి ఉంటే ఈరోజు ఆకాశవాణి రిలీజ్ అయ్యేది… కానీ ప్రస్తుతం పరీక్షాకాలం ఇది.. అందరూ ఇంట్లోనే ఉండి సురక్షితంగా ఉండాల్సిన సమయం.. పరిస్థితులు నార్మల్ కు వచ్చే వరకూ వెయిట్ చేయాల్సిందే.. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటిస్తామని తెలిపారు.

కాగా ఈ చిత్రాన్ని పద్మనాభరెడ్డి నిర్మిస్తుండగా.. బుర్రా సాయి మాధవ్ మాటలు అందిస్తున్నాడు. కీరవాణి కొడుకు కాలభైరవ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు ఎడిటర్‏గా జాతీయ అవార్డ్ గ్రహీత శ్రీకర్ ప్రసాద్ పనిచేస్తున్నారు. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఆ అంచనాలను ఈసినిమా రీచ్ అవుతుందో లేదో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − eight =