మలయాళ చిత్ర నిర్మాత సురేష్ , హీరోయిన్ మేనకల తనయ కీర్తి సురేష్ తన తండ్రి నిర్మించిన కొన్ని మలయాళ మూవీస్ లో బాలనటిగా నటించారు. “గీతాంజలి “మాలయల మూవీ తో కీర్తి కథానాయికగా మారారు. “ఇదు ఎన్న మాయం ” మూవీ తో కోలీవుడ్ ,”నేను శైలజ ” మూవీ తో టాలీవుడ్ కు కీర్తి కథానాయికగా పరిచయం అయ్యారు. తెలుగు , తమిళ, మలయాళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో కీర్తి సురేష్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. కీర్తి సురేష్ ప్రస్తుతం “సర్కారు వారి పాట “, “అన్నాత్తే” , “సాని కాయిదం “(తమిళ ), “వాశి ” మలయాళ మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
టాలెంటెడ్ యాక్ట్రెస్ కీర్తి కథానాయికగా రూపొందిన ఉమెన్ సెంట్రిక్ మూవీ “గుడ్ లక్ సఖి “ “మరక్కార్ ” (మలయాళ) మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ కీర్తి సురేష్ తన ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ఫిట్ నెస్ కు అధిక ప్రాధాన్యత నిచ్చే కీర్తి వర్కౌట్స్ తో పాటు యోగ కూడా చేస్తారు అన్న విషయం తెలిసిందే. యోగాకు ముందు సూర్య నమస్కారాల్ని ప్రాక్టీస్ చేస్తున్నారు. కరోనా కష్టకాలంలో మనశ్శాంతికీ , మానసికానందానికీ , చక్కని ఆరోగ్యానికి సూర్య నమస్కారాలు చాలా అవసరం అనీ , ఇంట్లోనే తక్కువ స్థలంలో సూర్య నమస్కారాలు యోగా ప్రాక్టీస్ కి ఎవరికైనా అవకాశం ఉంటుందనీ , విధిగా ప్రతి ఒక్కరూ అనుసరించాలనీ కీర్తి సందేశం ఇస్తూ తన ఫోటోను సోషల్ మీడియా లో షేర్ చేశారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: