లెజెండరీ యాక్టర్ నందమూరి తారకరామారావు పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. సాంఘిక చిత్రాలతో పాటు పౌరాణిక చిత్రాలలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ఎన్టీఆర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నటుడు , నిర్మాత , దర్శకుడు , స్టూడియో అధినేత గా ఎన్టీఆర్ కళామతల్లికి సేవలందించారు. తెలుగు దేశం పార్టీ స్థాపించి ఎన్టీఆర్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్య మంత్రి గా పని చేసి , పేద ప్రజలకు అనేక పథకాలు అమలుపరచి రాజకీయాలలో అనుభవం లేకున్నా సుస్థిర పాలన చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ రోజు నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా సోషల్ మీడియా వేదికగా సినీ సెలబ్రిటీలు, అభిమానులు ఆయనను స్మరించుకుంటున్నారు. ప్రముఖ గాయకులు, నవయుగ వైతాళికులు భూపేన్ హజారికా గారికి మరణాంతరం భారతరత్న ఇచ్చినట్లు మన తెలుగు తేజం, దేశం గర్వించే నాయకుడు నందమూరి తారక రామారావుగారికి భారతరత్న ఇస్తే అది తెలుగు వారందరికీ గర్వ కారణమనీ , వారి శత జయంతి దగ్గర పడుతున్న సందర్భంగా ఎన్టీఆర్‌గారికి ఈ గౌరవం దక్కితే అది తెలుగు వారికి దక్కే గౌరవమనీ , ఆ మహానుభావుడి 98వ జన్మదిన సందర్భంగా వారిని స్మరించుకుంటూ’’ అని ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ నటించిన “తిరుగులేని మనిషి” చిత్రంలో చిరంజీవి ఓ కీలక పాత్రలో నటించారు.



[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: