ప్రస్తుతానికి పెళ్లి వాయిదా అంటున్న మెహ్రీన్

Actress Mehreen Pirzada Marriage Gets Postponed Due To Corona Virus,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Actress Mehreen Pirzada,Mehreen Pirzada,Heroine Mehreen Pirzada,Mehreen Pirzada Latest News,Mehreen Pirzada Latest Film Updates,Bhavya Bishnoi,Mehreen Pirzada Gets Engaged,Mehreen Pirzada Marriage To Bhavya Bishnoi,Mehreen Pirzada and Bishnoi,Mehreen Marriage,Mehreen Pirzada Marriage News,Mehreen Pirzada Marriage Latest News,Mehreen Pirzada Wedding Update,Mehreen Pirzada Wedding,Actress Mehreen Pirzada Wedding,Mehreen Pirzada Marriage Postponed,Mehreen Pirzada Postpones Her Marriage,Mehrene Kaur Pirzada's Wedding Postponed,Actress Mehreen Pirzada Marriage Postponed,Mehreen About Her Wedding Plans,Mehreen Wedding Postponed,Mehreen Pirzada Wedding Postponed,Mehreen Pirzada About Marriage,Mehreen Pirzada Marriage,Mehreen Pirzada Marriage Date,Mehreen Pirzada Wedding Date,Mehreen Pirzada Husband

గత ఏడాది కూడా కరోనా వల్ల ఎవరూ బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది కానీ ఎప్పుడూ జరగనంతగా టాలీవుడ్ హీరోలు, పలువురు సెలబ్రిటీల పెళ్లిళ్లు మాత్రం చాలా జరిగాయి. ఇక ఈఏడాది అంత హడావుడి లేదు కానీ హీరోయిన్ మెహ్రీన్ అయితే పెళ్లి పీటలు ఎక్కనుంది. ఇప్పటికే మార్చిలో మెహ్రీన్ నిశ్చితార్థం కూడా జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఆడంపూర్ ఎమ్మెల్యే కుల్‌దీప్ బిష్ణోయ్‌ కుమారుడు.. కాంగ్రెస్ యువ నేత భవ్య బిష్ణోయ్ తో మార్చిలోనే నిశ్చితార్థం జరిగింది. అయితే ఇప్పడు పెళ్లికి మాత్రం అడ్డంకులు వస్తున్నాయి. దీనితో పెళ్లి ఇప్పట్లో జరిగే పరిస్థితులు కనిపించడం లేదు. ఇక తాజాగా ఓ మీడియాతో ముచ్చటించిన మెహ్రీన్ తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చేసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పెళ్లి గురించి ఆలోచన లేదని చెప్పుకొచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

గతేడాది మా నాన్న కరోనా బారిన పడ్డారు.. నిశ్చితార్థం జరిగాక మా అమ్మకు, నాకు కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చింది ప్రస్తుతం బానే ఉన్నాం.. నాకు కరోనా సోకిన సమయంలో భవ్య నాకు నిత్యం కాల్‌ చేసి నా యోగక్షేమాలు అడిగి తెలుసుకునేవాడు. నేను కోలుకున్న వెంటనే అతడికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఇప్పుడే పెళ్లి గురించి చర్చించడం లేదు.. పరిస్థితులు కాస్త నార్మల్ వచ్చేంతవరకూ ఆగుతాం అని చెప్పుకొచ్చింది. మరి చూద్దాం ఈ ఏడాదే వీరి పెళ్లి జరుగుతుందా..?లేక వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ అవుతుందా..?

కృష్ణగాడి వీర ప్రేమగాథ’లో నానికి జోడీగా నటించిన పంజాబీ ముద్దుగుమ్మ మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా.. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఎఫ్3 సరసన నటిస్తుంది. ఆసినిమాలో వరుణ్ సరసన నటిస్తోంది. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఈసినిమా తరువాత మెహ్రీన్‌ సినిమాలు చేస్తుందో..?లేదో చూడాలి.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + eighteen =