టాక్సీవాలా దర్శకుడు రాహుల్ సంకీర్త్యన్‌తో కలిసి నాని ‘శ్యామ్ సింగరాయ్’ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ మూవీలో ఇప్పటివరకూ చేయని అత్యంత ఆసక్తికర పాత్రను నాని చేస్తున్నారు. ఈ సినిమా కోసం ఆయన కొత్తగా మేకోవర్ అయ్యారు కూడా. ఇక ఈసినిమా చాలా వరకూ కలకత్తాలో షూటింగ్ ను చేసుకోవాల్సి ఉంది కానీ కరోనా వల్ల అక్కడికి వెళ్లలేని పరిస్థితి. ఈకారణంతోనే ఇక్కడే హైద్రబాద్ లో కలకత్తా సెట్ ను వేసిన సంగతి కూడా తెలిసిందే కదా. అక్కడే కీలక మైన సన్నివేశాలను షూట్ చేశారు. కలకత్తాలోని కాళీ మాత గుడితో సహా కొన్ని వీధులను గుర్తు చేసే విధంగా దీనిని నిర్మించారు. కరోనా టైంలో కూడా రిస్క్ చేసి చిత్ర యూనిట్ షూటింగ్ చేసారు. ఇక ఇక్కడ కూడా కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటంతో షూటింగ్ లు రద్దయ్యాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే హైదరాబాద్ లో గత మూడు రోజులుగా భారీ వర్షాలు పడటంతో ఆ భారీ సెట్ డ్యామేజ్ అయినట్టు తెలుస్తుంది. బాగానే నష్టం కలిగినట్టు చెబుతున్నారు. సెట్టును ఒకసారి మళ్లీ చెక్ చేసుకుని, తగిన మరమ్మతులు చేసిగానీ షూటింగుకు దిగడానికి లేదట.
కాగా నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ ఎస్. బోయనపల్లి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మడోన్నా సెబాస్టియన్, రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ డైరెక్టర్ కాగా.. సను జాన్ వర్ఘీస్ సినిమాటోగ్రాఫర్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా పని చేస్తున్నారు.



[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: