పెళ్లైన తర్వాత ఇంకా వరుస ఆఫర్లతో..పలు సినిమాలతో బిజీగా ఇప్పటికీ కెరీర్ లో దూసుకుపోతున్న నటి కాజల్. సమంత తరువాత పెళ్లైన తరువాత కూడా ఇంత బిజీగా ఉన్న నటిగా కాజల్ కూడా ప్రత్యేకస్థానాన్ని సొంతం చేసుకుంది. ఇక ప్రస్తుతం కాజల్ పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఇటీవలే మోసగాళ్లు సినిమాతో అలరించిన కాజల్.. ప్రస్తుతం కొరటాల-చిరు కాంబినేషన్ లో వస్తున్న ఆచార్య సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. దీనితో పాటు మరిన్ని ప్రాజెక్టులతో బిజీగా ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కాజల్ కు ఫ్యూచర్ లో కూడా హీరోయిన్ గానే కొనసాగుతారా అన్న ప్రశ్న ఎదురవ్వగా.. ఎంతకాలం నేను హీరోయిన్ గా కొనసాగుతానో తెలీదు.. తన భర్త నిర్ణయం బట్టి అది ఉంటుందని..ఒకవేళ తను యాక్టింగ్ మానేయమంటే యాక్టింగ్ కెరీర్ ను వదిలేస్తానని చెప్పింది. ప్రస్తుతానికి అయితే తన నుండి తన ఫ్యామిలీ మెంబర్స్ నుండి ఫుల్ సపోర్ట్ ఉందని.. వాళ్ల సహకారంతోనే ఇప్పుడు సినీ కెరీర్ ను విజయవంతంగా కొనసాగిస్తున్నాను అంటూ వెల్లడించింది.
పెళ్లైన తరువాత తన జోరును కొనసాగిస్తూనే ఉంది కాజల్. కేవలం సినిమాలు మాత్రమే కాదు అటు వెబ్ సిరీస్ లు కూడా చేస్తూ బిజీ బీజీ అవుతుంది. ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున హీరోగా వస్తున్న సినిమాలో నాగ్ పక్కన మొదటిసారిగా నటిస్తుంది. వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.



[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























