రాజ్ నిడిమోరు, కృష్ణ డికె దర్శకత్వంలో టెర్రరిజం-ఇంటెలిజెన్స్ అనే ప్రధాన ఎలిమెంట్స్ తో వచ్చిన వెబ్ సిరీస్ ది ఫ్యామిలీమ్యాన్. మనోజ్ భాజ్ పాయ్ ఇందులో ఎన్.ఐ.ఏ అధికారిగా నటించగా.. ప్రియమణి అతడి భార్య పాత్రను పోషించారు. అమెజాన్ లో వచ్చిన ఈవెబ్ సిరీస్ చాలా బాగా ప్రేక్షకాదరణ పొందింది. ఇక ఇప్పుడు సెకండ్ సీజన్ కూడా వచ్చేస్తుంది. ఇప్పటికే వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తయింది కూడా. మరోవైపు ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు. సీజన్ 2లో అక్కినేని కోడలు సమంత నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో నటిస్తుండడంతో దానిపై మరింత క్యూరియాసిటీ పెరిగింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి సిద్దమవుతున్నారు. రేపు అంటే మే19 న ఈట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నారు. ఈవిషయాన్ని సమంత తన ట్విట్టర్ ద్వారా కూడా తెలియచేసింది. ఇక దీనిపై చైతు కూడా స్పందిస్తూ.. ఫైనల్లీ టైమ్ వచ్చింది అంటూ సమంత ట్వీట్ ను రీ ట్వీట్ చేశాడు. ఇదిలా ఉండగా ఈసిరీస్ ను జూన్ లో స్ర్టీమింగ్ చేయాలని చూస్తున్నారు. మరి ఈసిరీస్ ఎంత హిట్ అవుతుందో చూద్దాం.
Finally !! It’s about time https://t.co/dN2b8ojZUd
— chaitanya akkineni (@chay_akkineni) May 18, 2021
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: