గత కొద్ది కాలంగా ఒకే రకమైన సిినిమాలు చేస్తున్న రాజ్ తరుణ్.. ఇప్పుడు కాస్త విభిన్నమైన సినిమాలను చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఈనేపథ్యంలోనే ఇటీవలే పవర్ ప్లే అనే సినిమాతో అలరించాడు. ఇక ఇప్పుడు మరో డిఫరెంట్ పాత్రలో వస్తున్నాడు. మోహన్ వీరంకి దర్శకత్వంలో రాజ్ తరుణ్ హీరోగా వస్తున్న సినిమా `స్టాండప్ రాహుల్`. కూర్చుంది చాలు అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అయితే ప్రస్తుతం కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్‌లుక్ కు దానితో పాటు రాజ్ తరుణ్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఈరోజు హీరో రాజ్ తరుణ్ పుట్టినరోజు కావడంతో ఒక స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఇక ఈపోస్టర్ కూడా అందరినీ ఆకట్టుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాను డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ మరియు హైఫైవ్ పిక్చర్స్ పతాకాలపై నంద్‌కుమార్ అబ్బినేని, భరత్ మగులూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో వర్షా బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. వెన్నెలకిషోర్, మురళిశర్మ, ఇంద్రజ, దేవీ ప్రసాద్ మరియు మధురిమ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. స్వీకర్ అగస్తి సంగీతం, శ్రీరాజ్ రవీంద్రన్ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: