సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “సర్కారు వారి పాట “మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. దుబాయ్ లో ఒక షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ ఉగాది రోజు ప్రారంభం అయ్యింది. కరోనా సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావంతో షూటింగ్ నిలిచిపోయింది. హీరో మహేష్ బాబు ఇంటికే పరిమితం అయ్యి కుటుంబ సభ్యులతో టైమ్ స్పెండ్ చేస్తున్నారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ మహేష్ బాబు మంచి విషయాలకు స్పందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
టాలీవుడ్ అందగాడు మహేష్ బాబు వయసు పెరుగుతున్న కొద్దీ మరింత అందంగా తయారవుతున్నారు. హీరో మహేష్ బాబు తన తనయ సితార తో ఉన్న సెల్ఫీ ని సోషల్ మీడియా లో షేర్ చేశారు. సితార క్యూట్ స్మైల్ , మహేష్ బాబు బ్లాక్ గ్లాసెస్ , గడ్డం మీసాలతో స్టైలిష్ గా ఉన్న ఆ సెల్ఫీ అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మహేష్ బాబు , దర్శకులు అనిల్ రావిపూడి , రాజమౌళి మూవీస్ ను ఓకే చేశారని సమాచారం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: