పలాస 1978 ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో సుధీర్ బాబు ప్రధాన పాత్రలో ‘శ్రీదేవి సోడా సెంటర్’ అనే సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈ సినిమాలో సుధీర్ ఫుల్ మాస్ లుక్ లో కనిపించనున్నాడు. అంతేకాదు ఇక సినిమాలో తన పాత్ర కోసం సుధీర్ గోదావరి యాస నేర్చుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈరోజు సుధీర్‌బాబు పుట్టినరోజు సందర్భంగా శ్రీదేవి సోడా సెంటర్ చిత్ర యూనిట్ నుండి గ్లింప్స్‌ను విడుదల చేసింది. ఇక ఈ వీడియోను బట్టి సినిమాలో సూరి బాబు అనే లైటింగ్ బాయ్ పాత్రలో సుధీర్ కనిపించనున్నట్టు అర్థమవుతుంది. ఆ పాత్రకు సంబంధించిన ఎలివేషన్ చేసేలా గ్లింప్స్ ఉంది. ఈ సినిమాలో పడవ పందెంకు సంబంధించిన సన్నివేశాలు కూడా చూపించారు. తిరునాళ్లలో హీరో, హీరోయిన్ మధ్య ప్రేమ, యాక్షన్ సన్నివేశాలను కూడా ఇందులో చూడొచ్చు. కాగా 70 ఎమ్ ఎమ్ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సక్సెస్ ఫుల్ నిర్మాతలు విజయ్ చిల్లా, శశిదేవిరెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.
మరి అక్కడుంది #LightingSooriBabu కదా .. కొంచెం ఓల్టేజ్ ఎక్కువే ఉంటది 💥💥 https://t.co/p5w5ICs8I7
#SrideviSodaCenter 😎 #70mmSSC#HBDSudheerBabu @70mmEntertains @VijayChilla @devireddyshashi @karunafilmmaker #ManiSharma @shamdat2 @sreekar_prasad @SabbaniRamakri1
— Sudheer Babu (@isudheerbabu) May 11, 2021
ఇక ఇదిలా ఉండగా.. ఇంద్రగంటి మోహనకృష్ణ తో సుధీర్ బాబు మరో సినిమాను కూడా లైన్ లో పెట్టేసాడు. బెంచ్ మార్క్ స్టూడియోస్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 1గా రూపొందనుంది. ఈ చిత్రంలో సుధీర్ బాబు సరసన ఉప్పెన సినిమా హీరోయిన్ కృతి శెట్టి నటించనుంది. దీనికి వివేక్ సాగర్ సంగీతాన్ని అందించనున్నారు. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: