“కిస్ “మూవీ తో కన్నడ చిత్ర పరిశ్రమ లో కెరీర్ ప్రారంభించిన శ్రీలీల , శ్రీ మురళి హీరోగా రూపొందిన “భరాటి” కన్నడ మూవీ లో కథానాయికగా నటించారు. దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో గౌరి రోణంకి దర్శకత్వంలో ప్రముఖ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా “పెళ్ళిసందD” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తో శ్రీలీల కథానాయికగా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. “పెళ్ళిసందD” మూవీ రిలీజ్ కాకుండానే శ్రీలీల టాలీవుడ్ లో బిగ్ ఆఫర్ అందుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మాస్ మహారాజా రవితేజ హీరోగా యాక్షన్ ఎంటర్ టైనర్ “ఖిలాడి ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సూపర్ హిట్ “నేను లోకల్ “,”హలో గురు ప్రేమకోసమే “మూవీస్ ఫేమ్ త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో ఒక మూవీ కి హీరో రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మూవీలో ఇద్దరు కథానాయికలలో ఒకరిగా శ్రీలీల ఎంపిక అయ్యారు. ఈ మూవీ లో నటించే అవకాశం వచ్చినందుకు , ఇటువంటి మూవీ లో భాగం అయినందుకు సంతోషంగా ఉందని శ్రీలీల తెలిపారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: