సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో నాని హీరోగా రూపొందిన “టక్ జగదీష్ ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. హీరో నాని ప్రస్తుతం నిహారిక ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “టాక్సీవాలా” మూవీ ఫేమ్ రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో కోల్ కత్తా నేపథ్యంలో తెరకెక్కుతున్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ “శ్యామ్ సింగరాయ్ ” మూవీలో నటిస్తున్నారు . “శ్యామ్ సింగ రాయ్ ” మూవీ తరువాత హీరో నాని , మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందనున్న “అంటే .. సుందరానికీ !” మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సౌత్ హీరోలకు బాలీవుడ్ లో నటించాలనే ఆసక్తి ఉంటుంది. చిరంజీవి , నాగార్జున , రామ్ చరణ్ , ధనుష్ వంటి హీరోలు బాలీవుడ్ మూవీస్ లో నటించారు. బాలీవుడ్ సినిమా లో నటించాలని ఉంది కానీ.. ఒకటే సమస్య అంటున్నారు హీరో నాని . ఆ సమస్యే హిందీ భాషనీ , హిందీ మాట్లాడగలను కానీ …బాలీవుడ్ సినిమా చేసేందుకు నాకొచ్చిన హిందీ సరిపోదనీ , హిందీ సినిమా చేయాలంటే కథ తనకు బాగా నచ్చాలనీ , హిందీ భాష మీద పట్టు సాధించాలన్న తపన నాలో కలిగేలా ఉండాలనీ , నాని బాలీవుడ్ ఇండస్ట్రీకి కొత్త అనే భావన ప్రేక్షకులకు రాకూడదనీ , అటువంటి కథ వస్తే తప్పకుండా నటిస్తాననీ హీరో నాని చెప్పారు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: