కరోనా సెకండ్ వేవ్ ప్రస్తుతం దేశంలో ఎంత విలయ తాండవం సృష్టిస్తుందో చూస్తున్నాం. ఇక రోజు రోజుకు పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది. ఈనేపథ్యంలో మరోసారి అందరూ ముందుకొచ్చి ఎవరికి తోచినంత సాయం వారు చేస్తున్నారు. ఇక సెలబ్రిటీలు సైతం ముందుకొచ్చి పలు సూచనలు, సలహాలు ఇస్తూ అప్రమత్తం చేస్తూ.. తగిన చేయూతనిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దేశం మొత్తం మీద కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. పరిస్థితి విషమించి హాస్పిటల్ కి వెళ్తే ఎక్కడా బెడ్లు దొరికే పరిస్థితి కూడా కనిపించడం లేదు. ఒకవేళ బెడ్ లు దొరికినా లక్షలు ఖర్చుపెట్టి ఫీజు కడితే తప్ప బెడ్ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు డాక్టర్స్ పరిస్థితికూడా అలానే ఉంది. రోజు మొత్తం హాస్పిటల్ లో ఉండాల్సి వస్తుంది.. ఇంటికి వెళ్లే పరిస్థితి కూడా లేదు.. ఈనేపథ్యంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకనుంచి ఈ స్టూడియోలో కరోనా రోగులకు వైద్యం చేస్తున్న వైద్యులకు బస కల్పిస్తామని ప్రకటించారు. ఈ మేరకు సురేష్ ప్రొడక్షన్ సంస్థ నుంచి అధికారిక ప్రకటన కూడా వెలువడింది. అలాగే దానికోసం కాంటాక్ట్ నంబర్లు కూడా షేర్ చేశారు. సురేష్ ప్రొడక్షన్ సంస్థ ఇలా ప్రకటించడంతో పెద్ద ఎత్తున ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: